Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Dietary principles for kidney stones కిడ్నీరాళ్లు!ఏం తినాలి?

 Dietary principles for kidney stones కిడ్నీ లో రాళ్లు ఉన్నప్పుడు ఏం తినాలి.  

Dietary principles for kidney stones కిడ్నీ లో రాళ్లు ఉన్నప్పుడు ఏం తినాలి.


కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఏం తినాలన్న సంకోసమే. ఎం తింటే ఏ సమస్య ముంచుకొస్తుందో అని భయపడుతూ ఉంటారు. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు టమాటాలు, పాలకూర తినకూడదు అని అనుకుంటారు. నీళ్లు ఎక్కువగా త్రాగితే కిడ్నీల్లో రాళ్లు వాటంతట అవే పడిపోతాయని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. 

కిడ్నీ జబ్బులు అన్నింటికీ ఒకేరకమైన ఆహార నియమాలు పాటించాలా?

చాలా మంది అన్నిరకాల కిడ్నీ సమస్యలకి ఒకే రకమైన కామన్ డైట్ ఒకటి వాళ్ళు అనుకున్నది అనుకుంటూ ఉంటారు, కొన్ని వాడుకలో కొన్ని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అందరికి ఒకే రకమైన డైట్ అనేది కాదు. ఎందుకంటే కిడ్నీ సమస్యలనేటివి అనేక రకాలుగా ఉంటాయి. 

ఉదాహరణకి

  • కిడ్నీలో రాళ్లు ఉండటమనేది ఒక సమస్య. 
  • ఎక్లూట్ కిడ్నీ ఇంజ్యూరి అంటే ఎక్లూట్ గా కిడ్నీ డామేజ్ అవడం ఇదొక రకమైన సమస్య. 
  • క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా కిడ్నీస్ పని తీరులో తేడా ఉండటం, దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. 
  • నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఎవరికైతే యూరిన్ లో ప్రోటీన్స్ మాత్రమె పోతాయి. కిడ్నీ ఫంక్షన్ అంతా నార్మల్గా ఉంటుంది. 

ఇలాంటి రకాలు, ఇన్ని రకాలకు కూడా కామన్ గా ఒకే రకమైన డైట్ అనేది ఉండదు. ఒక్కోరకానికి ఒక్కోరకమైన డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. అలాగే కొంతమందికి మనం కిడ్నీ లో రాళ్లు ఉన్నవాళ్లకు నీళ్లు అధికంగా తీసుకొమ్మని చెప్తాము. అదే విషయము మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 4,5 పేషంట్స్ తో చెప్తే వాళ్ళు తీవ్రమైన అస్వస్థకు లోనవుతారు. 

కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా త్రాగాలా?

వాటర్ ఇన్ టేక్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటర్ ఇన్ టేక్ అనే సరికి కొంతమంది అంటూ ఉంటారు, ఎన్ని లీటర్ లు త్రాగాలి డాక్టర్ గారు వాటర్ దాని వల్ల న కిడ్నీ లో స్టోన్స్ తగ్గుతాయా అని అడుగుతూ ఉంటారు. ఎన్ని లీటర్ లు త్రాగామన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఫ్రెక్కువెంట్ గా కంటిన్యూస్ గా వాటర్ త్రాగుతున్నామనేది ఇంపార్టెంట్. అంటే మనం ప్రొద్దున రెండు లీటర్ లు త్రాగేసి సాయంత్రం మల్లి ఇంటికొచ్చాక లేదా రాత్రి ఇంకో రెండు లీటర్ లు త్రాగి టోటల్ గా నాకు నాలుగు లీటర్ లు త్రాగితే సరిపోతుంది అని అనుకుంటే అది ఎట్టి పరిస్థితిలోను కరెక్ట్ కాదు. మనం ఒకసారి వాటర్ తీసుకుంటే దాని ప్రభావం 2 నుంచి 3 గంటలు వరకు ఉంటుంది. ఆ తర్వాత మల్లి దాని ప్రభావం తగ్గిపోతుంది. ఆ టైం లో యూరిన్ ఎక్కువైపోతోంది. డైల్యూట్ గా అయిపోతుంది సరిపోతుంది. మల్లి మిగతా పిరియడ్ అంతా కూడా మనం యూరిన్ పామ్ అయ్యేది కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. దాని వల్ల  ఏమవుతుంది అంటే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు యూరిన్ లో ఉండే ఈ క్యాల్షియం అయితేనేమి, అక్షిలేట్ అయితేనేమి, యూరిక్ యాసిడ్ అయితేనేమి అవి సూపర్ సాచురేటెడ్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న స్టోన్ గాని, ఒక మైనస్ గాని ఉన్నట్లయితే దాని మీద డిపాజిట్ అయిపోయి పిస్తలైజేషన్ అవుతుంది. అందువల్ల దీర్ఘకాలికంగా కొంతమందికి స్టోన్ ఫామ్టెండెన్సీ ఉన్నవాళ్లల్లలో స్టోన్ సైజ్ పెరుగుతూ క్రమంగా కొన్ని నెలలుగా కొన్ని మిల్లీమీటర్ల నుంచి అలా పెరుగుతూ పెద్ద స్టోన్ అయ్యి కంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 

అందువల్ల వాటర్ కంటిన్యూస్ గా త్రాగాలి. ఒక గ్లాస్ వాటర్ ప్రతి గంటకి, రెండు గంటలకు ఒకసారి త్రాగుతూ ఉండాలి. అలా త్రాగటం మూలాన కంటిన్యూస్ గా మనకి డైల్యూట్ యూరిన్ ఫామ్ అవుతుంది. డైల్యూట్ యూరిన్ ఎం చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న క్రిస్టల్స్ ఈ స్టోన్స్ ని కరిగించుకొని స్టోన్ సైజ్ ని తగ్గించే అవకాశం కొన్ని నెలలు బట్టి తగ్గే అవకాశం ఉంటుంది. 

కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు క్యాల్షియం లభించే పదార్దాలకు దూరంగా ఉండాలా?

క్యాల్షియం స్టోన్స్ అధికంగా ఉన్నాయని చాలా మంది ఇంటర్నెట్ లో చూసి ఏదైతే క్యాల్షియం కంటెంట్ ఉంటుందో దానికి సంబందించిన ఆహారాన్ని మొత్తం పూర్తిగా అవాయిడ్ చేసేస్తుంటారు. మిల్క్ ని గాని, కర్డ్ ని గాని, మిల్క్ ప్రొడక్ట్స్ గాని ఇవన్నింటిని ఆపేయడం జరుగుతావుంటుంది. అది పూర్తిగా తప్పు, కాల్షియం స్టోన్స్, కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ ఉన్నవాళ్లు కూడా క్యాల్షియం ని నార్మల్ రికమెండేడ్ రేట్ లోనే తీసుకోవాలి. తక్కువ తీసుకున్నట్లైతే వాళ్ళకి స్టోన్స్ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎలా అంటే మనకి క్యాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకు ఏదైతే బాడీలో ఆహారం లో క్యాల్షియం ఇన్ టేక్ అనేది ఉంటుందో ఆ క్యాల్షియం ఆహారం లో ఉన్న అక్షిలేట్స్ ని తీసుకొని మనకి మోషన్ ద్వారా బయటకి పంపిస్తుంది. 

ఎప్పుడైతే మనకి క్యాల్షియం ఇన్ టేక్ మొత్తం ఆపేస్తామో ఈ అక్షిలెట్స్ బాడీ లోకి అబ్జార్వ్ అయిపోతాయి. ఎక్కువగా అక్షిలెట్స్ అబ్జార్వ్ అయిపోయి యూరిన్ ద్వారా క్యాల్షియం అక్షిలెట్స్ అనే క్రిస్టల్స్ ద్వారా క్యాల్షియం అక్షిలెట్స్ అనే స్టోన్స్ తయారవుతు ఉంటాయి. క్యాల్షియం ఇన్ టేక్ నార్మల్ గా తీసుకోవడం అనేది చేయాలి. కానీ క్యాల్షియం అధికంగా కూడా తీసుకోకూడదు. ఆల్రెడీ స్టోన్స్ ఉన్నవాళ్లు పర్టికులర్ గా క్యాల్షియం సప్లిమెంట్స్ వంటివి అవాయిడ్ చేయడం మంచిది. 

కిడ్నీల్లో రాళ్ల స్వభావం ఆధారంగా ఆహార నియమాలు పాటించాలా ?

ఏ రకమైన స్టోన్ ఉంటుందో మనం గమనించినట్లయితే ఆ స్టోన్ కి తగ్గట్లుగా కొంతవరకు డైట్ లో మార్పులు చేయొచ్చు. మనకి ఉదాహరణకి క్యాల్షియం అక్షిలెట్స్ స్టోన్స్ కామన్ గా ఉంటాయి కాబట్టి మనకి అక్షిలెట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయడం మంచిది. వేటిల్లో ఎక్కువ అక్షిలెట్స్ ఉంటాయి. చాకోలెట్స్, నట్స్, స్పినాచ్ ( పాలకూర ), టమాటా ఈ టమాటా, పాలకూర కాంబినేషన్ లో తీసుకున్నవాళ్ళకి ఎక్కువగా ఈ అక్షిలెట్స్ ఇన్ టేక్ ఎక్కువవుతుంది కాబట్టి వాళ్ళల్లో స్టోన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ వారి ఇన్ టేక్ మట్టుకు కొంతవరకు తగ్గించుకొవడం చేయాలి. 

అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నవాళ్ళల్లో అధికంగా మాంసం తీసుకోవడం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. ఇన్ జనరల్ గా అందరు చేయాల్సింది ఏంటంటే ఉప్పుని కూడా తగ్గించుకొని తీసుకోవాలి. అన్ని రకాల స్టోన్స్ వాళ్ళు చేయాల్సినవి ఏంటంటే ఈ సిట్రిక్ యాసిడ్ అనేది మనకి స్టోన్స్ ని ఫామ్ అయ్యే గుణాన్ని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ లు పర్టిక్యూలర్ గా డయాబెటిస్ లేని వాళ్ళల్లో బాగా అధికంగా ఫ్రూట్ జ్యూస్ లు త్రాగడం అనేది మంచిది. 

ఇటువంటి బెస్ట్ కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ టిప్స్ కోసం మన హెల్త్ టిప్స్ తెలుగు ని రోజు పాలో అవుతూ ఉండండి, మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, ఆయుర్వేదానికి సంబందించిన విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏమైనా సలహాలు, సందేహాలు తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలపండి

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Kidney lu arogyanga undataniki am tinali. Manchi information ivvandi.

    ReplyDelete

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT