Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Ghee is it good for our health నెయ్యి అమృతమా? విషమా?

Ghee is it good for our health నెయ్యి అమృతమా, విషమా.

Ghee-is-it-good-for-our-health

Ghee is it good for our health తెలుగు వారి భోజనం అంటే షట్ రుచులు ఉన్న లేకపోయినా పర్లేదు కానీ కంచం లోకి మాత్రం కచ్చితం గా ఓ ఆవకాయ బద్ద కాస్తంత కమ్మటి నెయ్యి తప్పని సరిగా ఉండాల్సిందే. అయితే ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేటి కాలంలో మనలో చాలా మంది నెయ్యి ని ఒక విషపదార్థంగా చూస్తున్నారు. నెయ్యి వాడటంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని, గుండెపోటు విరుచుకుపడుతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు నెయ్యి నిజంగా అమృతమా? విషమా?..

వేడి వేడి అన్నం లోకి కాస్తంత ముద్దపప్పు దానిలోకి కాసింత కమ్మటి నెయ్యిని కలుపుకొని ఆపై కొత్త ఆవకాయబద్దని చప్పరించడమంటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టే అంటారు ఆ రుచిని ఆశ్వాదించిన వాళ్ళు. నిజమే కానీ ఇటీవల కాలంలో నెయ్యి వాడకం పై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తున్నాయి. నెయ్యి అనేది క్రొవ్వు పదార్థం కాబట్టి నెయ్యి వాడకం పెరిగితే మన రక్తం లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని నమ్ముతున్నారు. కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు పెరుగుతాయని భయపడుతున్నారు. ఈ భయాలతో చాలా మంది నెయ్యికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు నెయ్యి మన ఆరోగ్యానికి మంచిదేనా, నెయ్యి వాడకం పెరిగితే ఎలాంటి కష్టనష్టాలు ఎదురవుతాయో తెలుసుకుందాం. 

ఆటవిక దశలో మనిషి సంచార జీవి, దొరికిన పళ్ళు ఫలాలతో లేదంటే వేటాడిన మాంసంతోనో ఆకలి తీర్చుకునేవాడు. ఆ తర్వాత వ్యవసాయం కనిపెట్టాడు. మానవాళి సంచార జీవితానికి స్వస్తి పలికి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని జీవించడం మొదలుపెట్టాడు. పళ్ళు, ఫలాలు వేట మాంసంతో కడుపు నింపుకున్న దశకు వ్యవసాయం నేర్చుకొని ఆకలి తీర్చుకున్న దశకు మధ్య సంధి దశ ఒకటుంది. ఈ దశలో మనిషి పశుపోషణ చేసాడు. ముఖ్యంగా బర్రెలు, ఆవులు, మేకలు లాంటి వాటిని మచ్చిక చేసుకొని పాలు, పెరుగు, నెయ్యి లాంటివె కాకుండా అవసరమైతే వాటి మాంసాన్ని కూడా తిని ఆకలి తీర్చుకునే దశ అది. ఈ దశలోనే మనిషి నెయ్యి అనే ఒక అద్భుత ఆహార పదార్దాన్ని సృష్టించాడు. పశు సంపద నుంచి సేకరించిన పాలు, పెరుగు ద్వారా వెన్న తీసి, ఆ వెన్నని మరిగించి శ్రేష్ఠమైన నెయ్యిని ఆవిష్కరించి ఆ నెయ్యిని ఆహరం తో పాటు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మహాభాగ్యం గా మలుచుకున్నాడు. 

భారతదేశ సాంప్రదాయంలో, భారత సంస్కృతిలో ఎప్పటినుంచో కూడా నెయ్యికి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. భోజనం లో నెయ్యి లేకుండా భోజనం చేయకూడదు అనేటువంటి ఒక సిస్టమ్ అనేది ఉండేది పాతకాలంలో. దీనికి బేస్ ఏంటి అని గనుక ఆలోచిస్తే భారతీయ జీవన విధానాన్ని చాలా రకాలుగా శాశించినటువంటి ఆయుర్వేదం లాంటి శాస్త్రాల్లో నెయ్యి కి ఎంతో ప్రాముఖ్యం ఇవ్వబడింది. నెయ్యికి జీవినీయ గుణం ఉంటుందని, దాని వలన లైఫ్ పెరుగుతుందని, జీవిత ప్రమాణం పెరుగుతుందని, ఆరోగ్యం పెరుగుతుందని, పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయని, మనిషి యొక్క శారీరక బలం పెరుగుతుందని, మేధాశక్తి పెరుగుతుందని, ఇటువంటి అనేక రకాలైన సుగుణాలని నెయ్యికి ఆపాదించింది ఆయుర్వేదం. దాని వలన శతాబ్దాలుగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ వాళ్ళ వాళ్ళ ఆహారాల్లో నెయ్యిని కానివ్వండి, వెన్నని కానివండి ఇలాంటి వాటిని మొదటినుంచి వాడుతూ వచ్చారు. 

అయితే ఈ పరిస్థితి 1970 సంవత్సరాల నుంచి మారుతూ వచ్చింది. మోడరన్ మెడిసిన్ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచైతే హార్ట్ ఎటాక్ గురించి అవగాహన పెరుగుతూ వచ్చిందో హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలు గురించి అన్వేషణ జరుగుతూ వచ్చిందో హార్ట్ ఎటాక్ వచ్చే చాలా మందిలో రక్తంలో ఉన్నటువంటి క్రొవ్వు శాతం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటం గమనించడం, అందుచేత వెస్టర్న్ సైన్స్ కూడా శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ ని ఈ జబ్బుకి కారణాలలో ఒకటిగా లెక్కపెట్టడం మొదలెట్టాయి. 

శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కి అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కి మధ్య తేడాలు:

  • శాచ్చురేటెడ్ ఫ్యాట్ అనేది ఎప్పుడు కూడా మన రూమ్ టెంపరేచర్ లో గడ్డకట్టి ఉంటుంది. నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, లేదా వెన్న కానివ్వండి అంటే సాధారణమైన పరిస్థితుల్లో గడ్డకట్టి ఉండే కొవ్వుని మనం శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. 
  • ఆలా కాకుండా సాధారణ రూమ్ టెంపరేచర్ లో అది ద్రవరూపంలో ఉన్న ఫ్యాట్స్ ని అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ అంటాము. నువ్వుల నూనె కానివ్వండి, వేరుశనగ నూనె, పల్లి నూనె, సన్ ప్లవర్ ఆయిల్  ఇలాంటి అన్ని ఆయిల్స్ అన్ని కూడా అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కిందకి వస్తాయి. 

అయితే శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ ని 1970 దశకం నుంచి బ్లేమ్ చేయడం ద్వారా అది మన భారతదేశానికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని మనం చెప్పడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మట్టుకు నెయ్యి వాడవద్దు, ఉపయోగించవద్దు, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవద్దు అనేటువంటి ఒక కామన్ నానుడి అనేది జనాల్లో చాలా డీప్ గా వెళ్ళింది. 

అయితే దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఉంది. స్వతహగ ఏ రకమైన ఫాట్ కానివ్వండి అది శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కానివ్వండి, అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కానివ్వండి అది విషం కాదు. బాడీ లో ప్రతి ఒక్క పదార్దానికి మనం నెయ్యి లాంటి శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ నే తీసుకుంటే కొలెస్ట్రాల్ అనేది శరీరంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఉధాహరణకు : బాడీలో మనకు బైల్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే లివర్ తయారుచేసేటువంటి బైల్ సాల్ట్స్. ఈ బైల్ సాల్ట్స్ లేకపోతే మనకు జీర్ణ ప్రక్రియ అనేది కంప్లీట్ కాదు. ఈ బైల్ సాల్ట్స్ అనేవి కొలెస్ట్రాల్ నుంచి ఉత్పత్తి అవుతాయి. కొలెస్ట్రాల్ తీసుకోకపోవడం వలన వీటి ఉత్పత్తి తగ్గుతుంది. 

శరీరంలో ఉన్న అనేక రకమైన హార్మోన్స్ పర్టిక్యూలర్ గా అడ్రినలీన్ హార్మోన్స్ కార్టికో స్టిరాయిడ్స్ అంటారు. అంటే శరీరం లో ఉన్నటువంటి అనేకమైన మెటబాలిక్ యాక్టీవిటీస్ కి హెల్ప్ చేస్తూ ప్రోటీన్ ఎక్కడుండాలి, ఎముకలు ఎలా ఉండాలి, ఫ్యాట్స్ ఎక్కడుండాలి, ఇటువంటి అనేకమైన ప్రతి కణం యొక్క మెటబాలిజం కి హెల్ప్ చేసే హార్మోన్స్ అన్ని కూడా కొలెస్ట్రాల్ నుంచే తయారవుతాయి. 

విటమిన్ D, ఇది కొలెస్ట్రాల్ నుంచే తయారవుతుంది. అలానే విటమిన్ A, విటమిన్ E, ఇవన్నీ కూడా మిగతా నూనెలనుంచి, నెయ్యి నుంచి, ఫ్యాట్స్ నుంచే తయారవుతాయి. ఇవే కాకుండా బాడీ లో ఉన్నటువంటి సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానివ్వండి, టెస్టోస్టిరాన్ కానివ్వండి ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచే తయారవుతాయి బాడీలో. మెదడు మేధాశక్తికి కానివ్వండి, మనసుకు సంబంధించినటువంటి మెదడులో 60% దాని బరువులో కొలెస్ట్రాల్ తోనే తయారవుతుంది. 

ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా?

సృష్టిలో కల్తీ కానీ పదార్థం ఏదైనా ఉందా అంటే అమ్మపాలు అని సమాధానం చెప్పడం వింటుంటాం. ఒకప్పుడు ఈ మాట నిజమేమో కానీ కల్తీ అన్నది రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో ఆ మాటలు కూడా గట్టిగా చెప్పలేమేమో. నేడు మనం తినే ప్రతి ఆహార పదార్థం కూడా ఎక్కువకాలం నిల్వ ఉండాలని, చక్కగా మెరిసిపోవాలని రకరకాల హానికారక రసాయనాలను కలపడమన్నది బాగా పెరిగిపోయింది. దీంతో మనం త్రాగే పాలల్లో స్వచ్ఛత లేదు. మనం తినే బియ్యంలో పోషకాలు లేవు. మనం వంటల్లో వాడే నూనెలు మంచివి కావు. దాదాపు అన్ని ఆహార పదార్దాల్లోనూ కల్తీ అన్నది సర్వసాధారణ విషయం గా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేష్ఠమైన నెయ్యి లభించడం అన్నది కూడా కష్ట సాధ్యం గా కనిపించడం లేదు. బయట లభించే నెయ్యి కల్తీమయం అయిపోయింది. ఇలాంటి కల్తీ నెయ్యి వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా అది అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

  • సాంప్రదాయ బద్దంగా ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఒక బేస్ అయితే ఉంది. 
  • రేప్రొడెక్టీవ్ హెల్త్ కి అంటే దానివల్ల సంతానానికి మంచిది అంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ ని పెంచే అవకాశలు ఉన్నాయి.
  • అలానే పిల్లలకి మేధాశక్తి కి మంచిది అంటే కొలెస్ట్రాల్ అనేది మైలినేషన్ కి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఫాట్. 
  • జనరల్ హెల్త్ కి అంటే విటమిన్ D కి ఈ మధ్యలో గడుస్తున్న ప్రతి సంవత్సరంతోటి మనకి విటమిన్ D యొక్క రోజు కొత్త కొత్త విషయాలు మనకు ఎన్నో తెలుస్తున్నాయి. విటమిన్ D అనేది సాధారణంగా పాల నుంచి వెన్న నుంచి నెయ్యి నుంచి మనకి ఎక్కువగా లభిస్తుంది. 
  • చర్మానికి ఎండ తగలడం ద్వారా లభిస్తుంది. 

అందువలన కొలెస్ట్రాల్ స్వతహాగా దానికి బాడీలో ఎన్నో మంచి ఫంక్షన్స్ మంచి రోల్స్ ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో అది శరీరానికి హాని చేస్తుంది. ఇది కూడా సైన్స్ ద్వారా తెలుస్తుంది. ఈ విషయాలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంచి అయినటువంటి కొలెస్ట్రాల్ ఎందుకు హాని కలిగిస్తుంది. ఇది మనం అలోచించినప్పుడు దీంట్లో రెండు మూడు యాస్పెక్ట్స్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. 

  1. మనం నెయ్యి తాయారుచేసే ప్రక్రియలో మన దేశంలో వచ్చినటువంటి మార్పులు. ఈ విషయాల్ని అర్ధం చేసుకోవాలంటే కొన్ని విషయాల్ని అర్ధం చేసుకోవాలి. నెయ్యి గురించి పాశ్చాస్త దేశాల్లో జరిగినటువంటి స్టడీస్ ఏమి లేవు. ఎందుకంటే నెయ్యి అనేది ఓన్లీ భారతదేశం కానివ్వండి బాంగ్లాదేశ్, బర్మా, జపాన్, థాయిలాండ్, ఇటువంటి దేశాల్లో మాత్రమే వాడుతూ ఉంటారు. ఇది వెస్టర్న్ వరల్డ్ లో ఇది వాడరు. వాళ్ళు శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేది ఏంటంటే జనరల్ గా అక్కడ తయారయ్యే చీజ్ కానివ్వండి, ఫ్రాన్స్ ఫాట్ లాంటి చీజ్ కానివ్వండి, లేదా లార్డ్ అంటే జంతువులనుంచి తాయారుచేసేటువంటి ఫాట్. వీటిగురించి వస్తున్నటువంటి అనుభవాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. నెయ్యి గురించి మన దగ్గర జరిగిన అధ్యయనాలు చాలా తక్కువ. వాళ్ళ లాగానే ఇది కూడా బిహేవ్ చేస్తుంది అని మనం అనుకుంటున్నాం. 
  2. మనం నెయ్యి తయారుచేసే విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకముందు ప్రతి ఇంట్లో పాలని వేడి చేసి దాన్ని తోడు పెట్టి ఆ తోడు నుంచి మీగడ తీసి, ఆ మీగడ నుంచి వెన్న తీసి దాన్ని వేడి చేసి మనకి నెయ్యి తాయారుచేసేవారు. కానీ ఈ మధ్యలో నోటీస్ చేస్తే ప్రతి యొక్క పల్లెటూరులో పాలనుంచే డైరెక్టుగా వెన్న తీసేసి ఆ వెన్నని కాచి నెయ్యి తయారుచేస్తున్నారు. అంటే పెరుగులో ఉన్నటువంటి లాక్టో బాసిల్లస్ అనేటువంటి ఒక ఈస్ట్ యోక్క ప్రక్రియకి అది గురి కావడం లేదు. దీనివలన దాని గుణాల్లో కొంచెం తేడాలు వస్తాయి. కామన్ భాషలో చెప్పాలంటే దానికి అరిగించుకోవడానికి కొంచెం డిఫికల్టీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక పెను మార్పు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ అయినా 100% ప్యూర్ నెయ్యి అన్నా, దేశి ఆవు నెయ్యి అన్నా ఏ నెయ్యి అన్నా కూడా అంతా పాల నుంచి తీసుకున్న నెయ్యి తప్పించి ఇది పెరుగునుంచి వస్తున్నటువంటి నెయ్యి కాదు. 

ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు ఏ శాస్త్రాలు అయితే నెయ్యి అమృతం అని చెప్పాయో ఆ శాస్త్రాలన్నీ కూడా దాంతోపాటు ఒక జీవన సరళిని మనకు తెలియజేశాయి. అంటే ఉదయాన్నే లేవటం, వ్యాయామం చేయటం, రాత్రి టైం కి పడుకోవటం, సరైన సమయానికి భోజనం చేయటం, దాంతో పాటు పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా వ్యాయామం, ఋతుచర్య అంటే ఏ ఋతువులో తినొచ్చు, ఏ ఋతువులో తినకూడదు. పగటి పుట తినచ్చు, రాత్రి పుట తినకూడదు. ఎలాంటి నియమాలు అనేకమైనటువంటి షేప్ గార్డ్స్ అనేవి చెప్పడం జరిగింది. 

మారినటువంటి అర్బనైజేడ్ లైఫ్ స్టైల్ లో అంటే పట్టణాలలో మారినటువంటి జీవన శైలికి మనం ఇవన్నీ విడిచిపెట్టాం. ముఖ్యంగా వ్యాయామం విడిచిపెట్టాం. వ్యాయామానికి మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజానికి చాలా క్లోజుడ్ రిలేషన్ షిప్ ఉంది. ఎవరికైతే వాళ్ళ మెటబాలిజం ప్రాపర్ గా నడుస్తుందో వాళ్లలో నెయ్యి అనేది వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ కలిగిస్తుంది. విటమిన్ D ప్రొడక్షన్ పెంచటం కానివ్వండి. రేప్రొడెక్టీవ్ హార్మోన్స్ మీద ప్రభావం చూపించడం కానివ్వండి జరుగుంది. వ్యాయామం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ షుగర్ బారిన పడినటువంటి వాళ్ళు, హార్ట్ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్లల్లో అది హాని కలుగజేసే అవకాశాలు ఎక్కువ ఉండచ్చు. ఎందుకంటే దాన్ని అరిగించుకునేటువంటి మెటబాలిజం వీళ్ళలో తక్కువగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. 

తినే తిండి చేసే వ్యాయామం ఈ రెండే మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. దురదృష్టవశాత్తు ఈ రెండు కూడా నేడు గాడి తప్పాయి. తినే తిండిలో కల్తీతో పాటే జంక్ ఫుడ్ కూడా వచ్చి చేరింది. పైగా తినే వేళలు, తినే తీరు అన్ని క్రమం తప్పి పోయాయి. ఇక శారీరక శ్రమ అన్నది అపురూపంగా తయారవుతుంది. టెక్నాలజీ తెచ్చిపెట్టిన షౌక్యానికి అలవాటై వ్యాయామాన్ని పక్కన పెట్టేశారు. ఫలితంగా వొంట్లోకి క్యాలరీల వెల్లువ సునామీలా వచ్చి చేరుతుంటే ఆ క్యాలరీలు జీర్ణం కాక చివరకు క్రొవ్వుగా, కొలెస్ట్రాల్ గా తిష్ట వేసి అనారోగ్య హేతువుగా మారుతున్న వైనం అందరికి తెలిసిందే ఫలితంగా స్థూలకాయం, ఆ పైన థైరాయిడ్ సమస్యలు వీటివల్ల షుగర్, హై బీపీలు వచ్చిపడుతున్నాయి. ఇవన్నీ కలగలసి గుండె జబ్బులు, పక్షవాతాలు, క్యాన్సర్ల లాంటి జబ్బులుగా పరిగమిస్తున్నాయి. మన ఆహారాన్ని, వ్యాయామాన్ని గాడిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యాన్ని సాధించే ఈ క్రమంలో నెయ్యి వాడకం అన్నది మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT