Lose weight Use these 6 healthy ingredients to replace harmful sugar | Health Tips Telugu బరువు తగ్గించుకోండి, హానికరమైన చక్కెరను భర్తీ చేయడానికి ఈ 6 ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించండి.
Weight Lose బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ఎంతో ఎఫర్ట్, మనీ, టైం ఖర్చు పెట్టిన తర్వాత కూడా చాలా మందిలో వాళ్ళు కోరుకునే రిజల్ట్స్ రావు. కానీ మీకు ఒక సులభమైన మార్గం తెలియజేస్తాను. దానివల్ల మినిమమ్ ఎఫర్ట్ మరియు టైం ఖర్చుపెట్టడం వల్ల మీకు మాక్సిమం రిజల్ట్స్ లభిస్తుంది. ఆ ఈజీ మార్గం ఏంటంటే షుగర్ ని తీసుకోవడం మానేయండి. నేను మిమ్మల్ని స్వీట్స్ మానేయమని చెప్పడం లేదు. తీపి మీరు తినవచ్చు. కానీ చేయాల్సింది ఏంటంటే రిఫైన్డ్ టేబుల్ షుగర్ ని తొలగించి దాని ప్లేస్ లో హెల్త్య్ అల్టెర్నేటివ్స్ ని చేర్చుకోవడమే. ఎందుకంటే ఇవి పంచదారలాగే తియ్యగా ఉంటాయి. చాలా సులభంగా, చైకగా లభిస్తాయి.
అన్నిటికన్న ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఐటమ్స్ ఇంచుమించు అందరు ప్రతిరోజు తింటూనే ఉండే వస్తువు పంచదార. పంచదార కేవలం అన్ హెల్త్య్ మాత్రమే కాదు ఎడిక్టివ్ కూడా అంతెందుకు పంచదారను కొకైన్ కన్నా 8% ఎడిక్టివ్ గా చెప్తూ ఉంటారు. అదే కొకైన్ చాలా కంట్రీస్ లో బానెడ్ అని మనకు తెలుసు. ఒక రిఛర్చ్ ప్రకారం కొకైన్ ని ఎడిక్ట్ అయిన 94% ఎలుకలకు పంచదారను అలవాటు చేసినప్పుడు అవి కొకైన్ ని విడిచిపెట్టి పంచదారను ఎంచుకుంది. పంచదార ఎలాంటి ఇంగ్రిడిఎంట్ అంటే దానిమీదే ప్యాకేజ్డ్ ఇండస్ట్రీ అంతా నడుస్తుంది. డ్రింక్స్, జ్యూసెస్, బిస్కెట్స్, కేచప్స్, చాకోలెట్స్, ఫ్లేవర్ సీరియల్స్ ఏదైనా సరే షుగర్ తోనే తయారై ఉంటాయి.
మనం పంచదారను తిన్నప్పుడు మన బ్రెయిన్ ఫీల్ గుడ్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే తీపి వస్తువులను మల్లి మల్లి తినాలనిపిస్తుంది. అందుకే చాలా మందికి పంచదారను విడిచి పెట్టడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఏదేమైనా మీరు పంచదారను తగ్గించక్కర్లేదు, జస్ట్ రీప్లేస్ చేయండి. ఇలా ఎందుకంటే మనకి నాచ్చురల్ సోర్సెస్ నుండి షుగర్ లభిస్తుంది. అవి ఫ్రూట్స్ పండ్లు మనకు అంత చెడు చేయవు. ఎందుకంటే వాటిలో షుగర్ తో పాటుగా ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అవి బాడీలోకి షుగర్ ని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే మరోవైపు క్రిస్టలైజెడ్ షుగర్ చాలా కెమికల్ ప్రాసెసింగ్ తర్వాత తయారవుతుంది. దానిలో ఓన్లీ కాలరీస్ తప్ప ఎలాంటి మినరల్స్ గాని, విటమిన్స్ గాని, ఫైబర్ గాని, ప్రోటీన్స్ గాని ఏమి మిగలవు. క్రిస్టలైజెడ్ షుగర్ తీసుకోవడం వల్ల బరువు తప్పక పెరుగుతాము. దానితో పాటు బాడీలో ముడతలు, డార్క్ సర్కిల్స్, పింపుల్స్, పిప్పి పళ్ళు, చిగుర్ల సమస్యలు ఇంకా టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
Lose weight Use these 6 healthy ingredients to replace harmful sugar:
రానున్న 21 రోజుల వరకు మీరు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయండి, పంచదారను విడిచి దాని స్థానంలో నేను చెప్పే ఈ 6 ఆరోగ్యకరమైన అల్టెర్నేటివ్స్ ని ఉపయోగించండి. ఇంకా బాడీ లో జరిగే మార్పుని గమనించండి.
6. కోకోనట్ షుగర్
కోకోనట్ షుగర్ కోకోనట్ ట్రీ నుండి పెద్దగా రిఫైనింగ్ గాని, కెమికల్స్ గాని యూజ్ చేయకుండా తయారుచేస్తారు. రిఫైన్డ్ షుగర్ తో పోల్చుకుంటే కోకోనట్ షుగర్ ఈజీగా డైజెస్ట్ అవడడమే కాక ఇందులో ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం ఉంటాయి. కోకోనట్ షుగర్ యొక్క గ్లైజినిక్ ఇండెక్స్ కేవలం 35. టేబుల్ షుగర్ తో పోలిస్తే చాలా తక్కువ. కోకోనట్ షుగర్ ని మీరు పాలలో గాని, పెరుగులో గాని, కేక్స్ లో గాని, వోట్మీల్ తో గాని, బ్రేక్ఫాస్ట్ సీరియల్ లో గాని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ షుగర్ మీకు ఆన్లైన్ లో 200 గ్రాములు సుమారు 135 రూపాయలకు లభిస్తుంది.
5. డేట్ షుగర్
డేట్ షుగర్ పేరుతోనే తెలుస్తుంది, డేట్స్ ( కర్జురం ) తో తయారుచేస్తారు. కర్జురం నాచ్చురల్ గానే చాలా తియ్యగా ఉంటాయి. డేట్ షుగర్ ని టేబుల్ షుగర్ తో ఒక హెల్త్య్ అల్టెర్నేటివ్ గా భావిస్తారు. ఇంకా దీన్ని తయారుచేయడం కూడా చాలా ఈజీ, మీరు దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఖర్జురాన్ని రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నాక ఆ పౌడర్ ని జల్లడ పట్టండి. ఈ డేట్ షుగర్ లో ఎక్కువ ఫైబర్ ఉండటమే కాక విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. డేట్ షుగర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాక బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. డేట్ షుగర్ యొక్క గ్లైజెనిక్ ఇండెక్స్ 45 నుండి 50 వరకు ఉంటుంది. ఇది డేట్స్ యొక్క వెరైటీ మీద డిఫెండ్ అయి ఉంటుంది. డేట్ షుగర్ ని మీరు పాలు, టీ, పెరుగు, స్వీట్స్ లాంటి వాటిలో యూజ్ చేసుకోవచ్చు. డేట్ షుగర్ కొంచెం కాస్ట్లీనే 400 గ్రాములు సుమారు 320 రూపాయల వరకు ఉంటుంది.
4. పటిక బెల్లం
మన భారతీయులు ఎప్పటినుండో పటికబెల్లాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పటికబెల్లం అచ్చం రిఫైన్డ్ షుగర్ లాంటి టేస్ట్ ఉండటమే కాక చాలా హెల్త్య్ కూడా. కానీ ఎప్పుడు దీన్ని ఉపయోగించడం మానేసామో అర్ధం కావడం లేదు. రిఫైన్డ్ షుగర్ తయారయ్యేటప్పుడు ఒక స్టేజ్ లో కెమికల్ ప్రాసెసింగ్ కంటే ముందు పటికబెల్లం తయారవుతుందని మీకు తెలుసా. పటికబెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, డైటి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పటికబెల్లం డైజేషన్ కి తోడ్పడటమే కాక హిమోగ్లబిన్ ని కూడా పెంచుతుంది. పటికబెల్లం బాడీ కి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఇది రిఫైన్డ్ షుగర్ కన్నా బెటర్. పటికబెల్లాన్ని మీకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు. టీ, కాఫీ, మిల్క్, జ్యూస్, స్వీట్స్ లాంటి అన్నిటిలోను ఉపయోగించుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి తాడు కలిగిన పటికబెల్లాన్ని కొనుక్కొండి. మనకు బజార్లో దొరికే పటికబెల్లం చిప్స్ అస్సలు కొనకండి. ఎందుకంటే అవి రిఫైన్డ్ షుగర్ కి బిగ్గెర్ వెర్షన్ కాబట్టి వాటిని ఉపయోగించడం అంత మంచిది కాదు. తాడు కలిగిన పటికబెల్లం మీకు కిరాణా షాపులలో 150 రూపాయలకు 1 కేజీ చొప్పున లభిస్తుంది.
3. తేనె
తేనె యొక్క కంపొజిషన్ మనిషి బ్లడ్ యొక్క కంపొజిషన్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే మన బాడీ ఫ్యూర్ తేనె నుండి 100% న్యూట్రిఎంట్స్ ని ఈజీగా తీసుకుంటుంది. అంతేకాదు ఎలాంటి వస్తువుతోనైనా తేనెను కలిపి తీసుకుంటే ఈజీగా డైజేషన్ అవుతుంది. తేనె యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్స్, అధికంగా కలిగి వల్ల షుగర్ కి కరెక్ట్ ఆల్ట్రనేటివ్. తేనె గుండెని హెల్త్య్ గా, బ్రెయిన్ ని షార్ప్ గా, బాడీ ని ఫిట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. తేనెని చపాతీ, బ్రేడ్, నిమ్మరసం, పాలతోనైనా తీసుకోవచ్చు. మీకు మార్కెట్లో వివిధ రకాలైన రకాలైన తేనె లభిస్తుంది. వీటిలో అన్ ప్రొసెస్డ్ తేనె మంచిది. నార్మల్ గా ప్రొసెస్డ్ తేనెని 1 కిలోకి 300 రూపాయలు చొప్పున అమ్ముతూ ఉంటారు.
Also Read :- Simple morning habits for healthy mind | Health Tips Telugu | ఈ 9 అలవాట్లు ప్రతి ఉదయం పాటించండి.
2. స్టీవియా ( స్వీట్ తులసి )
మీరు క్యాలరీ కాన్సెస్ అయితే మీకు స్టీవియా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. స్టీరియా ఒక 0 క్యాలరీ నాచ్చురల్ స్వీట్నెస్. స్టీవియా ప్లాంట్ యొక్క ఆకులతో తయారవుతుంది. ఈ మధ్య కాలంలో స్టీరియా బాగా పాపులర్ అవుతుంది. కానీ ఆయుర్వేదిక్ లో స్వీట్ తులసి అనే పేరుతో ఎప్పటినుండో ఉపయోగిస్తున్నారు. స్టీరియా మరొక పేరే స్వీట్ తులసి. స్వీట్ తులసి నాచ్చురల్ గానే షుగర్ కన్నా 25% అధికంగా తియ్యగా ఉండటమే కాక 0 క్యాలరీస్ ఉంటాయి. స్టీవియా యొక్క గ్లైజెనిక్ ఇండెక్స్ 0, అందుకే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా పెంచదు. Weight Lose అవ్వడానికి ఒక మంచి ఆప్షన్. స్టీవియాతో చేసిన మాత్రలు, డ్రైనిస్, షాశస్ కూడా ఈజీగా లభిస్తాయి. 1 గ్రాము స్టీవియా షాశస్ కేవలం 3 రూపాయలలో మీకు లభిస్తుంది. కానీ స్టీవియాకి కొంచెం ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు దానితో ప్రాబ్లమ్ లేకపోతే ఈ రోజు నుండి స్టీవియాని ఉపయోగించడం స్టార్ట్ చేయండి.
మన టాప్ ఐటెం గురించి తెలుసుకునే ముందు కొన్ని నిశారనబుల్ మేన్షన్స్ గురించి తెలుసుకుందాం.. చాలా మంది షుగర్ ఫ్రీ, కోక్ జీరో లాంటి రకరకాల షుగర్ ఫ్రీ ఫుడ్స్ ని హెల్త్య్ ఆల్ట్రనేటివ్స్ అనుకోని తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ లో ఆర్టిఫిసియల్ స్వీట్ నెస్ లాంటి యాస్పెర్టేన్, యాసుళ్తేన్ పొటాషియం ని యాడ్ చేస్తారు. ఈ ఆర్టిఫిసియల్ స్వీట్ నెస్ అన్ హెల్త్య్ మాత్రమే కాదు లాంగ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగిస్తాయి. అందుకే గుర్తుంచుకోండి ఇలాంటి ప్రోడక్ట్స్ ని చూసి కొనండి.
1. జాగరి పౌడర్ ( బెల్లం పొడి )
షుగర్ కి నెంబర్ వన్ ఆల్ట్రనేటివ్ గా బెల్లం పౌడర్ ని ఉపయోగించుకోవచ్చు. చాలా కాలంగా భారతదేశంలో దీన్ని వాడుతూనే ఉన్నారు. న్యూట్రిషనల్ వాల్యూ కోసం మాట్లాడితే బెల్లంలో ఏ స్వీట్నేర్ లో లేనటువంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి. నిజానికి బెల్లం చెరుకు రసంతోనే తయారుచేసినప్పటికీ మినిమమ్ ప్రాసెసింగ్ తో తయారుచేస్తారు. బెల్లం ఒక నాచ్చురల్ బ్లడ్ ప్యూరిఫైయర్. మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. లివర్ ని డీటాక్షిపై చేస్తుంది. ఇంకా కాన్స్టిఫెషన్ ని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు స్కిన్ కి సంబందించిన సమస్యలుంటే షుగర్ కి బదులుగా జాగరి లేదా బెల్లం పౌడర్ ని వాడండి, మీకు రిజల్ట్ లభిస్తుంది. బెల్లం బాడీకి వేడి చేస్తుంది. మరోప్రక్క బెల్లం పొడి చలువ చేస్తుంది. అందుకే మీరు బెల్లాన్ని చలికాలంలోనూ, పౌడర్ ని సమ్మర్ లోను ఉపయోగించుకోవచ్చు. రెండింటిని టీ, కాఫీ, పాలు, స్వీట్స్ లలో వాడుకోవచ్చు. ఈ రెండు మార్కెట్లలో చాలా చీప్ గానే లభిస్తాయి. బెల్లం ఎంత డార్క్ గా ఉంటె అంత ఫ్యూర్ గా ఉంటుంది.
- వైట్ షుగర్ ని ఈ హెల్త్య్ అయినటువంటి ఆల్ట్రర్నేటివ్స్ తో 21 రోజుల వరకు రీప్లేస్ చేసి చూడండి, మీ బాడీ ఫ్యాట్ తగ్గడం, స్కిన్ గ్లో అవ్వడం మరియు ఎనర్జీ పెరుగుతుండటం మీరె గమనిస్తారు.
How to waight gain these more information please,,,, 😇
ReplyDelete😇