Top 10 Cheapest Protein Foods In India చవకగా లభించే Protein Foods | Health Tips Telugu
Cheapest Protein Foods In India ప్రోటీన్ మన డైట్ లో ఉండటం చాలా అవసరం, ప్రోటీన్ అనేది ఒక మాక్రో న్యూట్రిన్. అది మన బాడీ ని డైలీ రిపేర్ చేస్తుంది. బాడీ కి గ్రోత్ అందిస్తుంది, దాంతో పాటు స్కిన్ అండ్ హెయిర్ కి కూడా పోషణ అందిస్తుంది. ఒక సాధారణ మనిషి ఎవరైతే వర్కవుట్ చేయరో, రోజంతా కూర్చొని వర్క్ చేస్తారో వారికి కూడా 1 kg బాడీ బరువుకి 1 gram ప్రోటీన్ అవసరమవుతుంది. ఒకవేళ మీరు వర్కౌట్స్ చేస్తుంటే మీ బాడీ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే నేను ఈ ఆర్టికల్ లో 10 high protein foods గురించి తెలియజేస్తాను. ఇవి మీ డైలీ రిక్వైర్మెంట్స్ ని ఈజీగా కంప్లీట్ చేస్తాయి.
నేను ఈ protein foods ని వీటి కాస్ట్ ఎఫెక్టీవ్ నెస్ తో ఆధారపడి 10 నుండి 1 వరకు ర్యాంకింగ్ ఇచ్చాను, పూర్తిగా చదవండి మీకు చాలా ఉపయోగపడతాయి.
10. Tofu ( సొయాపన్నీర్ )
Tofu దీనినే సొయా పన్నీర్ అని పిలుస్తాము. ఇది ఆబియస్లీ సొయా బీన్స్ తో తాయారుచేస్తారు. Tofu ఒక బీగన్ ప్రోడక్ట్. అంటే ఇది ఒక యానిమల్స్ నుంచే తయారవదు. మీకు 200 గ్రాముల Tofu ప్యాకెట్ మార్కెట్లో 70 రూపాయలకు చాలా ఈజీగా లభిస్తుంది. ఒక్కసారికి 100గ్రాముల Tofu సరిపోతుంది. దీని అర్ధం ఏంటంటే Tofu యొక్క ఒక్క సర్వింగ్ 100 గ్రాములది 35 రూపాయలకు మీకు లభిస్తుంది. ఈ 100 గ్రాముల Tofu తో మీకు 15 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల కార్బోహైడ్రాట్స్, ఇంచుమించు 8 గ్రాముల ఫాట్స్ లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ తో పాటుగా కార్బోహైడ్రాట్స్ అండ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని లీం సోర్స్ అఫ్ ప్రోటీన్ అని చెప్పలేము. అంటే Tofu నుంచి లభించే 15 గ్రాముల ప్రోటీన్ మనకు 35 రూపాయిలు పడుతుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ 2.3 రూపాయలు పడుతుంది. ఒకవేళ మీరు Tofu తింటే మాన్బుబ్స్ ప్రాబ్లమ్ వస్తుందని ఆలోచిస్తుంటే అది ప్రతి రోజు 3 సార్లు తినేవారికి మాత్రమే వస్తుంది. ఒకరోజుకి 100 గ్రాముల Tofu పూర్తిగా సేఫ్.
9. Fish ( చేపలు )
మార్కెట్ లో రకరకాల చేపలు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రోటీన్ గురించి మాటాడుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చేప ఎంత తెల్లగా ఉంటె అంత మంచిది. ఇలా ఎందుకంటే తెల్లగా ఉండే చేపల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉండి ఫ్యాట్స్ మరియు కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉంటాయి. పిలాపియా అలాంటి చేపల్లో ఒకటి. ఇంకా ఇండియన్ ఫామ్పెట్, సాల్మన్ కూడా high protein చేపలే. వీటిల్లో కొంచెం ఫాట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ ఇవి హెల్త్య్ కూడా. ఆన్ అండ్ యావరేజ్ 1 Kg ఫిష్ ఇంచుమించు 500 రూపాయలకు లభిస్తుంది. Fish యొక్క రికమెండేడ్ సర్వింగ్ 100 గ్రాములు. అంటే ఒక్క సర్వింగ్ మీకు 50 రూపాయలు పడుతుంది. ఈ 100 గ్రాముల Fish తో 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే 25 గ్రాముల ప్రోటీన్ 50 రూపాయలు. మీకు 1 గ్రాము ప్రోటీన్ 2 రూపాయలు పడుతుంది. కానీ ఈ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ అండ్ కంప్లీట్ ప్రోటీన్. మీరు దీన్ని వారంలో ఒకటి నుంచి రెండు సార్లు తీసుకోవచ్చు.
8. Paneer ( పనీర్ )
200 గ్రాముల పనీర్ ప్యాకెట్ 70 రూపాయలకు లభిస్తుంది. ఒక్కసారికి 100 గ్రాముల పనీర్ సరిపోతుంది. అది మీకు 35 రూపాయలు పడుతుంది. కానీ 100 గ్రాముల పనీర్ నుండి 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కానీ దాంతోపాటు 20 గ్రాముల ఫాట్ లభిస్తుంది. పనీర్ లో ఫాట్ క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎత్లిట్స్ అప్పుడప్పుడు దీన్ని అవైడ్ చేస్తారు. కానీ ఈ ప్రాబ్లమ్ ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పనీర్ ని ఇంట్లోనే తయారుచేసుకున్నప్పుడు. యెల్లో గా ఉండే లో ఫాట్ మిల్క్ ప్యాకెట్ మీకు ఇంచుమించు 20 రూపాయలకు లభిస్తుంది. దీనితో 100 గ్రాముల పనీర్ తయారవుతుంది. ఇంకా ఇలాంటి పనీర్ లో ఫాట్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 20 రూపాయలకు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే 1 గ్రామ్ ప్రోటీన్ ఇంచుమించు 1 రూపాయి. అన్నింటి కన్నా మంచి విషయమేమిటంటే ఇంట్లో పనీర్ చేసుకోవడం చాలా ఈజీ. పాలను వేడి చేయండి, అందులో నిమ్మరసం వేయండి. పాలు విరిగిపోయి పనీర్ తయారవుతుంది. వాటర్ సపరేట్ అవుతుంది. మీకు తెలుసా ఈ వాటర్ ని ఉపయోగించే కంపెనీస్ వెర్ ప్రోటీన్ ని తయారుచేస్తాయి. అందుకే ఇంట్లో పనీర్ చేసుకోవడం వల్ల డబల్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మీరు బయటనుంచి తెచ్చుకునే పనీర్ కూడా 100 నుండి 200 గ్రాములు డైలీ తినవచ్చు.
7. Chicken Breast ( చికెన్ బ్రెస్ట్ )
ఈ రోజుల్లో మీరు లోకల్ వెండార్ నుంచి 1 Kg చికెన్ కొన్నట్లైతే దాదాపుగా 250 రూపాయలకు లభిస్తుంది. ఒకవేళ మీరు వాళ్ళను కొంచెం రిక్వెస్ట్ చేస్తే చికెన్ బ్రెస్ట్ బోన్లెస్ పార్ట్ 100 గ్రాములు మీకు 40 రూపాలకు లభిస్తుంది. ఈ 100 గ్రాముల చికెన్ మీకు 25 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ 1.6 రూపాయలు పడుతుంది. ఒకవేళ మీరు చికెన్ తింటే చికెన్ యొక్క బ్రెస్ట్ పార్ట్ డైట్ లో తప్పక ఇంక్లూడ్ చేసుకోండి. ఇందులో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది లీన్సో షబ్ ప్రోటీన్. ఇది మజిల్ బిల్డింగ్ లేదా వెయిట్ లాస్ రెండిటికి చాలా హెల్ప్ చేస్తుంది.
6. Legumes ( చిక్కుళ్ళు, బఠాణి )
రాజ్మా, తెలుపు మరియు నల్ల శనగలు ఇవన్నీ legumes క్యాటగిరి కె వస్తాయి. ఈ మూడింటి మాక్రో బ్రేక్ డౌన్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. 1 kg legumes 150 రూపాయలకు లభిస్తాయి. అంటే 100 గ్రాములు 15 రూపాయలు. ఇవే 100 గ్రాములు రాజ్మా తెలుపు మరియు నల్ల శనగలు ఉడికిన తర్వాత డబుల్ క్వాంటిటీ అయిపోతాయి. అందుకే 15 రూపాయలలో మీకు 15 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ 1 రూపాయి కి లభిస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోటీన్ తో పాటుగా 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తున్నాయి. అందుకే వీటితో పాటు మీరు 3 నుండి 4 రోటీలు తిన్నట్లైతే కార్బోహైడ్రేట్స్ ఓవర్ డోసెజ్ అవుతుంది. అందుకే మీ ఫిట్నెస్ గోల్స్ ప్రకారం ద్రుష్టి పెట్టండి.
5. Milk ( పాలు )
పాలలో పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్ యొక్క బయలాజికల్ వాల్యూ చాలా హై కాబట్టి. అంటే మీ బాడీ లో త్వరగా అబ్జార్వ్ అయిపోతాయి. మీ ఫిట్నెస్ గోల్స్ ని బట్టి మీరు టోన్డ్ లేదా ఫుల్ ఫాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్ 500 ml పాకెట్ మీకు 20 రూపాయలకు లభిస్తుంది. దీనితో మీకు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ మీకు 1.1 రూపాయాలకు లభిస్తుంది. మజిల్ బిల్డింగ్ లేదా ఫాట్ లాస్ కు అర లీటర్ పాలను మీ డైట్ లో తప్పక ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
4. Egg Whites ( గుడ్డు తెల్లసొన )
ఈ రోజుల్లో 30 గుడ్లు కలిగిన అట్ట మీకు ఇంచుమించు 140 రూపాయలకు లభిస్తుంది. అంటే ఒక గుడ్డు 4.66 రూపాయలు పడుతుంది. 1 ఎగ్ వైట్ లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ మీకు 1.16 రూపాయలు లభిస్తుంది. ఎగ్ వైట్స్ లో మంచి విషయం ఏంటంటే ఇందులో ప్రోటీన్ తప్ప ఇంకమీ ఉండవు. ఇంకా ఇది కంప్లీట్ సో సాప్ట్ ప్రోటీన్ అవడం వల్ల బాడీలో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా దీనికంటూ ఒక టెస్ట్ లేకపోవడంతో మీరు దీన్ని ఏదైనా కూరల్లో మిక్స్ చేసుకొని తినొచ్చు.
3. Peanuts ( వేరుశనగలు )
1 Kg వేరుశనగలు మీకు 120 రూపాయలు పడుతుంది. 1 సర్వింగ్ పీనట్స్ ఇంచుమించు 30 గ్రాములు ఉంటుంది. అంటే 3.5 రూపాయలు పడుతుంది. 30 గ్రాముల పీనట్స్ తో మీకు 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే 1 గ్రాము ప్రోటీన్ అర్ద రూపాయి. అలాగే పీనట్స్ ప్రోటీనే కాకుండా హెల్త్య్ ఫ్యాట్స్ కి కూడా ప్రైమరీ సోర్స్. కానీ మనం ఓవరాల్ డైట్ గురించి మాట్లాడుకుంటే ఈ 7 గ్రాముల ప్రోటీన్ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని ఫుల్పిల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. మీరు పీనట్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. లేదా పీనట్ బటర్ లాగా కూడా తీసుకోవచ్చు.
2. Pulses ( పప్పులు )
పప్పులు ఇండియన్ డైట్లో ఒక అంతర్లీనమైన పాత్రని పోషిస్తున్నాయి. పప్పులు కూడా చాలా వెరైటీస్ లో లభిస్తాయి. కొన్ని పప్పులు 1 Kg 70 రూపాయలకు లభిస్తాయి. మరికొన్ని 1 Kg 120 రూపాయాలకు లభిస్తాయి. ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటే 1 Kg పప్పు ఇంచుమించు 80 రూపాయలకు లభిస్తుంది. ఒక్క సర్వింగ్ అంటే 100 గ్రాములు 8 రూపాయలు పడుతుంది. పప్పులు కూడా ఉడికిన తర్వాత డబల్ అవుతాయి. 100 గ్రాముల పప్పు నుండి 18 గ్రాముల ప్రోటీన్, 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్ లభిస్తుంది. అంటే 1 గాము ప్రోటీన్ 0.44 రూపాయలు పడుతుంది. ఇందులో కూడా ప్రాబ్లమ్ కార్బోహైడ్రేట్స్ దే. అందుకే రోటి అండ్ రైస్ ని బాలన్స్ చేసుకోండి. పప్పుని ఇన్ కంప్లిట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 9 ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉండవు. కానీ మనం పప్పులను మిక్స్ చేసుకొని తింటే కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా తయారవుతాయి. రోటి అండ్ రైస్ తో పప్పుని తీసుకుంటే కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా చెప్పుకోవచ్చు.
1. Soy Chunks ( సొయా ముక్కలు లేదా మిల్ మేకర్స్ )
PROTEIN SOURCE | RANK | PROTEIN PER SERVING | PRICE(/g) | BIOAVAILABILITY |
---|---|---|---|---|
SOY CHUNKS | 1 | 25g | 0.40 | 59 |
LENTILS | 2 | 18g | 0.44 | 65 |
PEANUTS | 3 | 7g | 0.50 | 43 |
EGG WHITES | 4 | 24g | 1.16 | 94 |
MILK | 5 | 10g | 1.10 | 91 |
LEGUMES | 6 | 16g | 1.00 | 58 |
CHICKEN BREAST | 7 | 25g | 1.60 | 79 |
PANEER | 8 | 18g | 2.00 | 48 |
FISH | 9 | 25g | 2.00 | 83 |
TOFU | 10 | 15g | 2.33 | 59 |
ఇవే బెస్ట్ అండ్ చీపెస్ట్ ప్రోటీన్స్ సోర్సెస్ ఇన్ ఇండియన్ మార్కెట్. మీరు వీటిని మీ ఫిట్నెస్ గోల్స్ ని అనుసరించి డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అందించండి డైలీ మన HealthTipsTelugu.com వెబ్సట్ ని ఫాలో అవుతూ ఉండండి మీ కోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకొస్తూ ఉంటాను. మీరు ఏదైనా తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో తెలపవచ్చు.