Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Causes of Headaches and Amazing Ayurvedic Treatment

Causes of Headaches and Amazing Ayurvedic Treatment for Immediate Relief of Headaches.

Headache-Health-tips-telugu

మనం ప్రాచీన సాహిత్య లేదా ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలను పరిశీలించినట్లయితే "యదూత్తమంగా మంగాణాం శిరస్తహ అభిధియొతే " అని చెప్పే చరకాసమితిలోని ఒక శ్లోకం దొరుకుతుంది. అంటే మనకు ఉన్నటువంటి అన్ని అంగాలలో కూడా శిరస్సు అనేది ప్రధానమైనటువంటిది అని చరక మహర్షి తన చరక సమితిలో ఈ విదంగా చెప్పడం జరిగింది.

ఈ తలనొప్పిని 'శిరస్సుల' అని ఆయుర్వేద వైద్యం లో మన మహర్షులు చెప్పడం జరిగింది. ఈ తలనొప్పి చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు ఎవ్వరికైనా రావచ్చు, చాలామంది ఈ తలనొప్పితో ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటారు.


ఈ తలనొప్పి వచ్చేందుకు సాధారణ కారణాలు, అసాధారణ కారణాలు అని మీ అందరికి అర్ధమయ్యే విధంగా  వివరణ చేసాము. 

👉తలనొప్పి వచ్చేందుకు సాధారణ కారణాలు 

no-rest-health-tips-telugu
విశ్రాంతి లేకపోవడం

వేలకు విశ్రాంతి లేకపోవడం, వేలకు ఆహారాన్ని తీసుకోకపోవడం, అదేవిదంగా వేలకు సరిగ్గా నిద్రపోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న కారణాల వలన తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ కారణాలకు సంబంధించి మనం మార్చుకోగలిగితే ఆ తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఇవి సర్వసాధారణంగా వచ్చేటువంటి తలనొప్పులు. 

👉తలనొప్పి వచ్చేందుకు అసాధారణ కారణాలు 

కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో కూడా ఈ తలనొప్పులు రావచ్చు. ఉదాహరణకు :- కంటికి సంబంధిచినటువంటి సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావొచ్చు. చెవికి సంబందించిన సమస్యలు ఉన్నప్పుడు తలనొప్పి రావచ్చు, అదే విధంగా జీర్ణాశయానికి సంబందించిన సమస్యలు, ఆహరం సరిగ్గా జీర్ణం కానప్పుడు, మలబద్దకం ఉండటం, ఇలాంటి సందర్భాల్లో కూడా తలనొప్పి రావచ్చు, అదేవిదంగా మెదడులో కొన్ని రకాల రసాయనాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు రావడం వలన కూడా తలనొప్పి రావచ్చు, పోషక ఆహార లోపం వలన కూడా తలనొప్పి రావచ్చు, అదేవిధంగా అల్ప రక్తపోటు వల్ల, అధిక రక్తపోటు వల్ల కూడా తలనొప్పి రావచ్చు.  

tablets-health-tips-telugu
వివిధ రకాల ఔషదాలు వాడటం వాల్ల తలనొప్పి రావచ్చు

కొన్నిరకాలైనటువంటి ఔషదాలు వాడటం వాల్ల కూడా తలనొప్పి రావచ్చు, అదేవిదంగా మానసిక వత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంతమందిలో విపరీతంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ తోడు ముక్యంగా మహిళల్లో బహిష్టు సమయాల్లో గాని, బహిష్టు ముందు గాని తలనొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి రీజన్స్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. 

అనేక రకాలైనటువంటి ఔషధాలను తలనొప్పి తగ్గించడానికి సూచించడం జరిగింది. వాటిలో అతి సర్వసాధారణమైనటువంటి, అందరికి ఆమోదయోగ్యమైనటువంటి, అందరు ఆచరించదగినటువంటి ఎన్నాళ్లు వాడిన ఎలాంటి దుష్పరిణామాలు కలగనటువంటి చక్కటి గృహ వైద్యాన్ని మనం ఇప్పుడు తెలుగుకుందాం. 

1. రక్తపోటు ( బీపీ ) తక్కువగా ఉన్నప్పుడు వచ్చేటువంటి తలనొప్పిని ఇప్పుడు చెప్పబోయే ఔషధం చాల చక్కగా పనిచేస్తుంది. 

తయారీ విధానం :

salt-health-tips-telugu-headache
ఉప్పు (Salt)

ఉప్పు ఒక 50 గ్రాములు తీసుకోవాలి, అదేవిదంగా పటికబెల్లం పొడి 50 గ్రాములు  తీసుకొని ఈ రెండింటిని బాగా కలపాలి, ఈ విదంగా తయారుచేసుకున్న ఔషధాన్నిఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక గ్లాసులో 50ml నీళ్లలో 1 గ్రాము లేదా 2 గ్రాములులు ఈ ఔషధాన్ని కొలుపుకొని ఒక్క డోస్ లో త్రాగాలి. 

⛬ ఎక్కువ రక్తపోటు( హై బీపీ ), కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ ఔషధాన్నిడాక్టర్ సలహా మేరకు వాడండి. 

2. మానసిక వత్తిళ్లు లేదా పోషకాహార లోపం వాల్ల  మరియు కొన్ని రకాల ఔషదాలు వాడటం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే తలనొప్పికి ఈ ఔషధం శక్తి వంతంగా పనిచేస్తుంది. 

తయారీ విధానం :
badam-yalakulu-health-tips-telugu
లవంగాలు,బాదాం,యాలకులు

గసగసాలు మనందరికీ తెలిసినటువంటి వస్తువే, గసాలు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, గసగసాలు అని కొన్ని ప్రాంతాల్లో పిసుస్తుంటారు. ఈ గసగసాలను మెత్తగా పొడిచేసి ఈ పొడిని 60 గ్రాములు తీసుకోవాలి, బాదాం పప్పుని మెత్తగా పొడిచేసి ఒక 60 గ్రాములు తీసుకోవాలి, అలాగే ఎండు ఖర్జురం పొడి ఒక 60 గ్రాములు తీసుకోవాలి, యాలకుల విత్తనాల పొడి 5 గ్రాములు తీసుకోవాలి, చివరగా పటికబెల్లం పొడి 120 గ్రాములు తీసుకోవాలి, వీటన్నిటిని బాగా కలుపుకొని ఔషధాన్ని తయారుచేసుకోవాలి. ఈ విదంగా తయారుచేసినటువంటి ఔషధాన్ని ఓక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి, రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక గ్లాసులో 50ml నీళ్లు తీసుకొని 2 నుచి 3 గ్రాములు( హప్ టీ స్పూన్ ) ఔషధాన్ని కలుపుకొని మొత్తంగా త్రాగెయ్యాలి. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వలన ఫలితం చాల శక్తివంతంగా ఉంటుంది. 

⛬ షుగర్ ప్యాసెంట్స్ ఈ ఔషధం వాడెప్పుడు డాక్టర్ సలహామేరకు తీసుకోండి. ఎందుకంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు ఈ ఔషధంలో పటికబెల్లం వాడటం జరిగింది కాబట్టి చెక్కెర శాతం కొందరిలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉపయోగించాలి అనుకుంటే పటిక బెల్లం పొడిని కలపకుండా ఔషధాన్ని తయారుచేసుకోవాలి.

3. జీర్ణాశయ సంబంధ రుగ్మతల వల్ల వచ్చే తలనొప్పులకు చాల బాగా పనిచేసే ఔషధం. 

coriander-health-tips-telugu
ధనియాలు

ధనియాలని దోరగా వేయించి మెత్తగా పొడిచేసి 50 గ్రాములు తీసుకోవాలి, అదే విదంగా సోంపుని దోరగా వేయించి పొడి చేసి 50 గ్రాములు తీసుకోవాలి, అదే విధంగా పటికబెల్లం పొడి 50 గ్రాములు తీసుకోవాలి, ఈ మూడింటిని బాగా కలుపుకొని ఔషధాన్ని తాయారుచేసుకోవాలి. ఈ విదంగా తాయారు చేసుకున్న ఔషధాన్ని సీసాలో భద్రపర్చుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 నుంచి 3 గ్రాముల ఔషధాన్ని ఒక గ్లాసులో 50ml నీళ్లలో కలుపుకొని ఒక్క డోస్ గా సేవించడం వలన చాల అద్భుతమైన ఫలితం ఉంటుంది.

⛬ షుగర్ ప్యాసెంట్స్ డాక్టర్ సలహామేరకు ఉపయోగించాలి, ఒకవేళ ఉపయోగించాలి అనుకుంటే పటిక బెల్లం పొడిని కలపకుండా ఔషధాన్ని తయారుచేసుకోవాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT