What precautions should be taken when the dengue fever arrives? డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా వరకు డెంగ్యూ జ్వరాలతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ వాతావరణానికి ఎక్కువగా వైరల్ ఫివర్స్, కోల్డ్, కాఫ్, ఫ్లూ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ సీజన్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్, పెద్దవాళ్ళు వీళ్ళు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది డెంగ్యూ ఫీవర్ తో బాధపడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీనికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే చాలా వరకు ఇమ్మ్యూనిటి( రోగనిరోధక శక్తి ) తక్కువ అవడం వల్ల ఈ ఫీవర్స్ వచ్చిన కూడా వాటి నుండి తొందరగా బయట పడటానికి ఎక్కువగా మన ఆరోగ్యం క్షిణించకుండా మనం రికవర్ అవడానికి మనం తీసుకునే ఆహారం చాలావరకు ఉపయోగపడుతుంది.
డెంగ్యూ ఫీవర్ వచ్చిందని మనం బాధపడటం దీని గురించి ఎక్కువగా వర్రీ అవడం కంటే దానిలోనుంచి బయటికి రావడానికి పౌష్ఠిక ఆహారం తీసుకొని మనం ఎక్కువగా సీరియస్ కండిషన్ కి వెళ్లకుండా దాని నుండి తొందరగా ఇంప్రూవ్ అవడానికి ఉంటుంది.
ఈ డెంగ్యూ ఫీవర్ లో మనం కామన్ గా చూసేది ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనినే త్రోమ్బో సైటోపీనియ అంటారు. ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయో దాని ద్వారా మనకు చాలా వరకు బాడీలో ఆక్సిజన్ తగ్గిపోవడం, తర్వాత బెడ్ రెస్ట్ అవడం, దాని ద్వారా చాలా వరకు క్రిటికల్ కండిషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరియు దీని ద్వారా చాలా వరకు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మనం అంత కండిషన్ కి వెళ్లకుండా ఈ డెంగ్యూ ఫీవర్ ని మనం మొదట్లోనే గుర్తించి దాంట్లో ప్లేట్లెట్స్ ఎప్పుడైతే తగ్గుతూ ఉన్నాయని మనకు తెలుస్తుందో ఇమ్మిడియట్ గా మన యొక్క ఆహారంలో కొంత మార్పులు చేసుకుంటూ, ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి.
ఎలాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి?
ముఖ్యంగా
- ఎగ్స్ (గ్రుడ్లు).
- పాలు.
- నాన్వెజ్ తినేవాళ్లు అయితే చికెన్ గాని ఫిష్ గాని చాలా వరకు ఇంట్లో తయారుచేసినవె తీసుకోవాలి.
- ఫీవర్(జ్వరం) ఎక్కువ ఉన్నప్పుడు చాలా వరకు ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి.
- ముఖ్యంగా మన యొక్క ఆహారంలో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మనకి ఎల్లో మరియు రెడ్ కలర్ ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుంది.
- దానిమ్మలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు స్టామినా(ఎనర్జీ) ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో ఐరన్, కాల్షియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి బ్లడ్ ఫ్యూరిపై అవడం తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి.
- దానిమ్మతో పాటు చెర్రీస్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకోవడం లేదా వీటితో తయారుచేసిన జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి.
- పపాయ తీసుకోవడం చాలా మంచిది. పపాయలో ఉండే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల తొందరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. పపాయ జ్యూస్ తో పాటు వీటి ఆకులు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కొంత వరకు స్టామినా వస్తుంది. ఫీవర్ వల్ల ఉండే లో ఎనర్జీ లెవెల్స్ తర్వాత వీక్నెస్ నుంచి తొందరగా రికవర్ అవడానికి చాలా ఉపయోగపడతాయి.
- పపాయ జ్యూస్ తాగడం వల్లనే కాకుండా అన్నిరకాలైన పోషక పదార్దాలతో కూడిన ఆహారంతో పాటుగా పపాయ ని కూడా యాడ్ చేసుకోవాలి.
- ఎందుకంటే మనకి ఫీవర్ వచ్చినప్పుడు వీక్నెస్ తో పాటు విటమిన్స్, మినరల్స్ లోపం రావడం తర్వాత గ్యాస్ ప్రాబ్లెమ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దీంట్లో ముఖ్యంగా మనం ఫ్రూట్ జ్యూసెస్ తో పాటుగా కొంతవరకు B12 ఎక్కువగా ఉండేవి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి, జింక్ ఎక్కువగా ఉండేవి, ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, బిన్స్ లో అధికంగా B12 లభిస్తుంది. రాజ్మా, సోలె శనగలు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా కొంతవరకు బాయిల్ చేసుకొని ఏదైనా స్నాక్స్ లాగా గాని, వీటిని ఎక్కువగా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది.
- వీటితో పాటుగా Vitamin K అధికంగా ఉన్న ఫుడ్స్ మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆకుకూరలు, కారట్, క్యాబేజ్ వీటిల్లో Vitamin K అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడమే కాకుండా బ్లడ్ ఇంప్రూవ్ అవడం, మనం సీరియస్ కండిషన్ కి వెళ్లకుండా చాలా వరకు ఉపయోగ పడుతుంది.
- మన ఆహారంలో ముఖ్యంగా ఆకు కూరలతో తయారుచేసినవి, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం తప్పకుండా మన ఆహారంలో ఎగ్, పాలు, నాన్వెజ్ తినేవాళ్లు అయితే చికెన్, ఫిష్, సూప్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటు ఉండొచ్చు.
- వీటితో పాటు మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ని చేర్చుకోవడం, తర్వాత Vitamin B12, Vitamin B9 పోలియెట్ రిచ్ ఉన్న ఫుడ్స్ ని కూడా మనం చేర్చుకోవాలి. ఇవి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ లో అధికంగా దొరుకుతుంది. డెంగ్యూ జ్వరం తో బాధపడుతున్నవాళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల తొందరగా వారి యొక్క ఇమ్మ్యూనిటి పెరగడం దాని ద్వారా వాళ్ళు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి ఇవి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది.
- దీనితో పాటు మన చుట్టుపక్కల వాతావరణాన్ని, మనం నివసించే ప్రాంతం లో దోమలు లేకుండా ఉండేలాగా, పిల్లలు ఉండే చోట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
- వీటితోపాటు డెంగ్యూ జ్వరం రాకుండా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి దోమలకి ఎక్కువగా ఎక్సపోజ్ అవకుండా ఉండటం, తర్వాత చాలా వరకు మంచి పౌష్ఠిక ఆహారం తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది.
- మన ఆహారం లో మంచి ప్రోటీన్ తో కూడినవి తీసుకోవడం, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ ని తీసుకోవడం, క్యారెట్, బీట్రూట్స్ కూడా చాలా వరకు మన ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఎక్కువగా బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని జ్యూస్ రూపంలో లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ డెంగ్యూ బారిన పడకుండా తర్వాత డెంగ్యూ నుండి తొందరగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ డెంగ్యూ జ్వరాలతో బాధపడేవాళ్ళందరిలో వాళ్ళ ఇమ్మ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండటం మనం గమనించవచ్చు. ఎందుకంటే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇమ్మ్యూనిటి డౌన్ ఉండటం వల్ల ఈ జ్వరం బారిన పడటం వల్ల ఇంకా వాళ్ళు సివియర్ కండిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇమ్మ్యూనిటి హెల్త్య్ గా ఉంటుందో, హెల్త్య్ డైట్ తో ఉన్నవాళ్లు తొందరగా వీటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది.
మన యొక్క డైట్ ఎక్సర్ సైజ్ తో పాటు ఎప్పుడైతే ఇవన్నీ పాలో అవుతామో మనం తొందరగా రికవర్ అవడం, తర్వాత చిన్న చిన్న జ్వరాలను, జలుబు, దగ్గు, లాంటి వాటి వల్ల బాధపడకుండా సింటమ్స్ ని గమనించుకొని దాని ద్వారా డైట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటె ఇమ్మ్యూనిటి మంచిగా ఉంటుంది. కాబట్టి ఫివర్స్ నుంచి తొందరగా బయట పడటానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ డెంగ్యూ ఫివర్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా మన ఆహారంలో చాలా వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ని మనం స్టార్ట్ చేయాలి. ఫీవర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ టైములో ముఖ్యంగా ఎక్కువగా పండ్ల రసాలు, సూప్స్, రాగులు, సజ్జలు, జొన్నలు లాంటివి జావలాగా చేసి తీసుకోవడం చాలా మంచిది.
ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే ఫీవర్ కొంచెం కంట్రోల్ అయ్యి కొంతవరకు ప్లేట్లెట్స్ డౌన్ ఉన్న వాళ్ళు అయితే కొంతవరకు ఆహారంతో పాటుగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఎగ్స్, క్యారెట్, బీట్రూట్స్, జ్యూసెస్ లాగా తాయారుచేసి ఇవ్వడం, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటుగా ఇమ్మ్యూనిటి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల ఈ ఫ్రూట్ జ్యూసెస్ ని ప్రతి 2గంటలకు ఒకసారి ఇవ్వడం, దానిమ్మ, పపాయ, కివి జ్యూస్, కారట్, స్ట్రాబెరి జ్యూసెస్ ఇవన్నీ ఆహారంలో ఎల్లో, ఆరంజ్ కలర్ లో ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా చేర్చుకొంటూ ఉండాలి. దానితో పాటు రెండు పూటలా పాలు తీసుకొంటూ ఉండాలి. ప్రోటీన్ సప్లిమెంట్స్ యాడ్ చేసుకొంటూ అంటే వీక్నెస్ ఎక్కువగా ఉంటె ఈ యాంటిబయోటిక్ వల్ల చాలా వరకు వాళ్ళ డైజేషన్ కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది కాబట్టి ప్రోబయాటిక్స్ తో కూడిన ఆహారం మజ్జిగ, తర్వాత పెరుగు వారి యొక్క ఆహారం లో చేర్చుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఎప్పుడైతే అందజేస్తామో అప్పుడే మనం డెంగ్యూ ఫీవర్ నుంచి తొందరగా బయటపడటానికి, ఇమ్మ్యూనిటి పెరగడానికి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి.
ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు
- ఈ వ్యాధి ఎక్కువగా 'Aedes aegypti' అనే మస్కిటో (దోమ) కుట్టడం వల్ల వస్తుంది.
- దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎక్కువగా మంచి నీళ్ళల్లో పెరుగుతుంది. అంటే పాత వాడేసిన ఎయిర్ కూలర్లు, తీసేసిన టైర్లు, పూల కుండీలు, ఇలాంటి వాటి గుంరించి మనం డాబామీదనో ఎక్కడో పడేసి వాటిగుంరించి మనం పట్టించుకోము చాలా సంత్సరాలపాటు వీటిలో వర్షం నీళ్లు నిలువ ఉన్నప్పుడు వాటిలో ఈ 'Aedes aegypti' అనే ముస్కిటో పెరుగుతుంది.
- కాబట్టి ఎప్పడికప్పుడు మన పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలువ ఉన్న వాటిని కాళీ చేసి జాగ్రత్తగా ఉంచుకున్నట్లైతే ఎక్కువగా ఈ దోమల బారి నుండి మనని మనం కాపాడుకోవచ్చు.
- Aedes aegypti ముస్కిటో కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎక్కువగా మోకాళ్ళ కింద భాగంలోనే కుడుతుంది. దీనికి కొంచెం బద్ధకం ఎక్కువ అందుకని ఇది ఎక్కువగా మోకాళ్ళ కింద భాగంలో కుట్టే అవకాశం ఉంది.
- అందుకని లాంగ్ స్లీవ్స్ ఉన్న బట్టలను, పాదాలవరకు ఉన్న బట్టలను వేసుకున్నట్లైతే ఈ ముస్కిటో బైట్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు.