16 principles for good health | మంచి ఆరోగ్యానికి 16 Health Tips Telugu
16 principles for good health సహజంగా అందరు అనుకునేది పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని నానుడి. అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పండంటి ఆరోగ్యానికి 16 సూత్రాలు పాటించాల్సిందే అంటున్నారు వైద్యులు. అవి ఏమిటి అంటారా? ఒక మహాకవి అన్నట్టు ఉసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి ఆ మహాకవి అన్నది నిజమే అనిపిస్తుంది. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నిజం. ఏ వ్యక్తి అయినా ఏదైనా చేయాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. శరీరంలో శక్తి హరించుకుపోయి, నీరసంగా, అలసటగా ఉంటె పని చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో forty q అంటారు. ఈ రకమైన స్థితిని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోక తప్పదు అంటున్నారు వైద్యులు. forty q స్థితి నుండి ఎలా బయట పడాలి అని అనుకుంటున్నారా? శరీరంలో నీరసంగా, అలసటగా ఉందని అనిపించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అని. వాటిలో ముఖ్య కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడం, లేదా ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం, వ్యక్తి మానసిక ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ప్రాధాన్యంగా చెప్తున్నారు వైద్యులు.
శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు తీసుకోకపోతే శరీరంలో శక్తి సరిపడా ఉత్పత్తి కాదు. దీనివల్ల మొదటగా నష్టపోయేది జీవితం పట్ల ఉత్సాహం తగ్గిపోవడం, చర్మంలో మృదుత్వం పోయి, ముఖంలో తేజస్సు తగ్గిపోయి రోమాలు రాలిపోవడం, గోళ్లు పగులు వచ్చి వ్యక్తి జబ్బు వరిస్తుందని సూచన గా చెప్పుకోవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇందుకు విరుగుడుగా నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచించారు.
మంచి ఆరోగ్యానికి 16 సూత్రాలు
1. వారానికి ఒకరోజైనా పళ్ళు ఫలాలు తీసుకోవాలి. అరుగుదల ఎక్కువ సమయం తీసుకునే మాంసం, కొవ్వు, జున్ను లాంటి ఆహారాలను తప్పుడు కాంబినేషన్ లో రెగ్యులర్ గా అధిక మొత్తంలో తీసుకుంటే వ్యక్తి తేలికగా అలసిపోతారు. దురదృష్టం ఏమిటి అంటే వారం మొత్తం నాన్వెజ్ ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అందుకు బదులుగా వారంలో ఒక్కరోజు మరే ఆహారాన్ని తీసుకోకుండా తాజా పళ్ళు, ఫలాలు, మంచి నీళ్ళు తీసుకుంటే వారమంతా శ్రమించిన ప్రేగులకు రెస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. తిరిగి శరీరం కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ ఉంది.
2. ప్రేరక పదార్థాలు వద్దు. ఉప్పు, పంచదార, coffee, tea, మసాలా కూరలు ముఖ్యంగా alcohol, cigaretలు శరీరంలో శక్తిని హరిస్తాయి. అదేవిధంగా అతిగా సెక్స్ కార్యంలో పాల్గొన్నప్పుడు అడ్రినల్ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏమైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదా. కాస్త మీ శక్తిని మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి.
3. బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. ఉదయాన్నే breakfast తీసుకోవడం చాలా ముఖ్యం. Breakfast తీసుకోకుంటే రక్తంలో glucose శాతం తగ్గి ఎపొగలి సిమియా వచ్చే అవకాశం ఉందని doctors హెచ్చరిస్తూ ఉన్నారు. దీని మూలంగా కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, మనసుకు శరీరానికి సమన్వయం సన్నగిల్లడం, మనిషి పూర్తిగా నిర్ధారణగా మారిపోవడం సంభవిస్తుంది. శరీరానికి ఆహారం కొద్ది కొద్దిగా ఇవ్వండి. అసలు ఇవ్వకుండా ఉండకండి. ఇతర సమస్యలు తెచ్చుకోకండి.
4. Relax. చాలా మందికి అన్నం తిన్న వెంటనే బయటకి వెళ్ళిపోవడం లేక పనులు నిమగ్నం అవ్వడం అలవాటు. అలా కాకుండా భోజనం తర్వాత కొద్దిసేపు relax కావాలి. తర్వాత మాత్రమే పనుల్లో పాల్గొనాలి. ఎంతసేపు relax కావాలి అంటే తక్కువలో తక్కువ పావు గంట అయిన relax కావాలని doctorలు సూచిస్తున్నారు.
5. బాగా నీళ్లు తాగాలి. నిజం చెప్పాలంటే చాలా మంది రోజు నీళ్ళు తాగరు. అసలు నీళ్ళు తాగక పోవడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు విశ్లేషించారు. మరి తక్కువ నీళ్ళు తాగడం వల్ల శరీరంలో మలబద్దకం పెరిగిపోతుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి పోకపోవడం వల్ల శరీరం విషపూరితం అవుతుంది. దీని వల్ల శరీరం అలసటకు కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు. శరీరం అలసటకు గురి కాకుండా ఉండాలంటే నీళ్ళు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
6. పరిశుభ్రమైన ఆహారం. ఆ రోజుల్లో క్రిమి సంహారక మందులు చల్లకుండా ఉండని పళ్ళు, కూరగాయలు ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా దాదాపు క్రిమి సంహారక మందులు, కూరగాయలు, పళ్ళు లోపలకు చేరుతాయి. వీటిని శుభ్రంగా నీటితో కడిగి తినాలి. అలా కాకుండా అపరిశుభ్రమైన పళ్ళను కూరగాయలను తింటే మాత్రం శరీరంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కూరగాయలైనా పళ్లు అయిన పరిశుభ్రంగా కడిగి తినమని అంటున్నారు వైద్యులు.
7. ఉదయాన్నే నిద్రలేచి మొహం కడుక్కో గానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగితే అది నిద్ర పూరిత శరీరాన్ని మంచి ప్రేరకంగా పనిచేస్తుంది.
8. పళ్ళు ఫలాలు కొందరు అన్నం తిన్న తరవాత అలాటి పండ్లను లేదా ఆయా మాసాల్లో వచ్చే మామిడి పళ్ళు, ఇతర పళ్ళను తీసుకుంటారు. అన్నం తిన్న వెంటనే కొందరికి అజీర్ణం, తేన్పులు గుండెల్లో మంట తో బాధపడుతూ ఉంటారు. వేగంగా జీర్ణమయ్యే పళ్ళు, ఫలాలను నిదానంగా జీర్ణమయ్యే ప్రోటీన్ లలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారంతో తీసుకుంటే వాటిలో ఏది సరిగ్గా జీర్ణం కాదు. పళ్ళను అన్నం తినడానికి బాగా ముందు కానీ భోజనానికి భోజనానికి మధ్య సమయంలో గాని తీసుకోవడం మేలు.
9. బాగా నమిలి తినాలి. మనం తిన్న ఆహారం నోటి ద్వారా ప్రారంభమవుతుంది. ఆహారం జీర్ణం కావాలంటే మింగ బోయేముందు నోటిలో దంతాలు, లాలాజలం పడుతుంది. ప్రక్రియ ద్వారా ఆహారం జీర్ణం అవుతుంది. అలా కాకుండా నమలకుండా మింగితే అజీర్తి, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటివి సమస్యలు వస్తాయి.
10. ఒంటికి నలుగు పెట్టండి. మనం నిత్యం సహజంగా స్నానం చేసేటప్పుడు ఒంటికి సబ్బు రాసుకొని స్నానం చేస్తాం. పాత సంప్రదాయం ప్రకారం మన గ్రామీణ ప్రాంతాల్లో అమ్మలు, అమ్మమ్మలు తప్పనిసరిగా వారానికో నెలకు శరీరానికి సున్నిపిండి కలిపి ఒంటికి పట్టించి కాసేపు ఎండలో నిలబెట్టి తలంటి వేడి నీళ్ళు పోసేవారు పిల్లలకి, దీనిలో ఉన్న ఆరోగ్య రహస్యం తేలికగా దీనిని వ్యతిరేకించే షాంపు స్నానం తో సరి పెట్టుకుంటున్నారు నేటి ఆధునిక యువత. అసలు రహస్యం ఏమిటి? అంటే చర్మాన్ని మర్దన చేయడం వల్ల శరీరంలో సరైన రక్త ప్రసారం జరిగి, లిప్ గ్రంధులు వ్యవస్థ తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. శరీరంలో లోపాలు ఉన్న విషపూరిత పదార్థాలు బయటకి విసర్జించబడతాయి. DNA వల్ల సెట్రిడం మంచి ఉత్సాహంతో తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల శరీరం మహా కాంతివంతంగా తయారయ్యి మెరుస్తుంది. ఆచరిద్దాం శరీరాన్ని కాంతివంతంగా చేసుకుందాం.
11. బరువు తగ్గించండి శరీరం మరి బరువుగా, ఉబకాయంతో ఉంటె అనారోగ్యానికి మీరు తలుపులు తీసినట్లే అని అంటున్నారు వైద్యులు. ఉబకాయం వల్ల డయాబెటీస్, గుండెపోటు వస్తాయి అని అంటున్నారు వైద్యులు. ఉబకాయం వల్ల త్వరగా అలసిపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు వస్తాయని. మరి తక్కువ తిన్న అలసిపోతారు. అధిక శరీరాన్ని తగ్గించుకోవడానికి తేలికైన మార్గం ఆహారంలో గుజ్జు, ప్రోటీన్లు కలిపి తీసుకోకూడదు. ఉదాహరణకు ప్రోటీన్ లతో ఉండే చేపలు, గంజి తో ఉన్న అన్నాన్ని ఒకేసారి తీసుకోకూడదు. అందుకు బదులుగా సలాడ్ తో పాటు మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటే సాయంత్రం వారి అన్నాన్ని రాత్రి కూరగాయలతో తీసుకోవాలి. లేదా లంచ్ లో ఆమ్లెట్ తీసుకొని రాత్రి భోజనంలో బంగాల దుంపను తీసుకోవచ్చు. ఈ రకమైన ఆహార పదార్థాలను వాళ్ళ ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యి ఉబకాయం మీ కంట్రోల్ లో ఉంటుంది.
12. అవసరమైతే విటమిన్లు, శరీరం అలిసిపోయి నీరసంగా ఉన్నప్పుడు doctor సలహా మేరకు సూచించిన vitamin మందులు tablets తీసుకోవచ్చు. ఏ vitamin ఎలా వాడాలి ఎంత వాడాలి అసలు వాడాలా వద్దా అన్నది doctor నిర్ణయించాలి. అయితే ఇతరులు ఇచ్చిన సలహా మేరకు vitamin tabletలు వాడకూడదని doctorలు సూచిస్తున్నారు. Vitamin B శరీరం త్రివ్రంగా నిరసించి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కొంత ఉపశమనం ఉన్న యాంటిబయోటిక్ మందులతో పాటు Vitamin B తీసుకుంటే శరీరాన్ని బాలన్స్ చేస్తుంది. Vitamin B లో magnesium, vitamin C తో పాటు B complex మందును doctor ని సంప్రదించి తీసుకోవచ్చు. ఆకుకూరలు, పళ్ళు తీసుకుంటే మరీ మంచిది.
14. దీర్ఘకాలంగా డైటింగ్ చేయకూడదు. అందంగా కనబడాలని ఒళ్ళు తగ్గించుకోవాలని ఎవరికీ ఉండదు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ కాలం పాటు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే చర్మం పొడిపాడడం, హార్మోన్ లోపం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. ముఖ్యంగా స్త్రీలకు జననేంద్రియాల్లో పొడి వాడడం, కీళ్ల నొప్పులు అలసట లాంటివి చోటు చేసుకునే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీర్ఘకాలంపాటు డైటింగ్ చేసేవాళ్ళలో కూడా ఎనిమియా సమస్యలతో పాటు ఇతర అవయవాల లో కూడా సమస్యలు వస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. Zero size కోసం ట్రై చేస్తారు. సమస్యలు తప్పవు.
15. మానసిక సమస్యలే పెద్ద అనారోగ్యం. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య తీవ్ర ఒత్తిడి, ఇతర సమస్యలు నిత్యం మిమ్మల్ని వేధించే సమస్యలే. మనిషి ప్రాణాన్ని సగం కృంగదీస్తుంది. సమస్యను పరిష్కరించుకోవాలి. లేదా ఇతరులతో అయినా పంచుకుంటే కాస్త బరువు తగ్గుతుంది. అలా కాకుండా దీర్ఘకాలంగా ఆలోచిస్తూ ఉంటే అనారోగ్యం మిమ్మల్ని మరి కుంగ తీస్తాయి. మనసును ధ్యానం వైపు మళ్ళించండి కొంత ఉపశమనం వస్తుంది. అందుకే వర్రీలకు దూరంగా ఉండండి. Be positive be happy.
16. నిదానంగా గాఢమైన శ్వాస తీసుకోవాలి. ఒత్తిడిలో కుంగిపోయిన వాళ్ళు శ్వాసను గాఢంగా తీసుకోకుండా, పైపైన గాలిని పీల్చుకుంటూ సరి పెట్టుకుంటూ ఉంటారు. దీనిని hyper ventilation అంటారు. శ్వాసను పైపైన తీసుకోవడం వల్ల త్వరగా అలసటకు లోనయ్యే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. Deep breath తీసుకునే ప్రక్రియ మంచిది. పొత్తి కడుపును మీ లోపలికి లాక్కుంటూ మీ లోపల ఉన్న గాలిని ముక్కు ద్వారా బయటికి వదలాలి. నెమ్మదిగా గాఢంగా ముక్కు ద్వారా గాలిని బయటికి వదలాలి. ఇలా శ్వాసను పీలుస్తూ మీరు గుండె నిండా నింపుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. అయితే మీరు చేసే ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ఉండాలి.