Homemade Thyroid Remedies | Health Tips Telugu
ఈ Home made Thyroid Remedies ని పాలో అయితే చాలు ఎటువంటి థైరాయిడ్ సమస్య అయినా ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ మధ్య ప్రతి పది మందిలో ఐదుగురు ఈ 'థైరాయిడ్' సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ప్రస్తుతం 'ఆడవారిలో' నే మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫీస్ కి వెళ్లి 'స్త్రీలు' ఒత్తిడికి గురవ్వటం. దాంతోపాటు 'గర్భాధారణ' సమయంలో వచ్చే సమస్యలు, 'పీరియడ్స్' సమస్యలు ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల కూడా 'హార్మోన్స్ ఇంబ్యాలన్సు' వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. సీతాకోక చిలుక! ఆకారంలో ఈ గ్రంధి అనేది మన 'గొంతు' దగ్గర భాగంలో ఉంటుంది. అయితే థైరాయిడ్ వచ్చిన వారు మందులు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా బరువు తగ్గాలి అని అనుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు.
- ముఖ్యంగా ధనియాలలో, విటమిన్స్_, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
- ధనియాలు మన శరీరంలోని "హార్మోన్స్" ని రెగ్యులేట్ చేయడంతో పాటు అన్ని రకాల "ఇన్ఫెక్షన్స్" ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి.
- మెయిన్ గా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది హార్మోన్స్ ఇంబ్యాలన్స్ వల్లే కాబట్టి ధనియాలు అనేవి మన శరీరంలోని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు పరుస్తాయి.
- ధనియాల కషాయం అనేది సులభంగా 'అధిక బరువును' కూడా తగ్గిస్తుంది.
అసలు 'థైరాయిడ్' ఎందుకు వస్తుందో తెలుసా?
మనం సరైన పద్దతిలో సరైన సమతులన ఆహారాన్ని తీసుకోకపోవడం. మన శరీరంలో ఉన్న "థైరాయిడ్ హార్మోన్స్" సరిగ్గా పని చేయకపోవడం వల్ల 'థైరాయిడ్' అనేది వస్తుంది. ఎందుకంటే మన శరీరంలోని మెడ భాగం లో 'థైరాయిడ్ గ్లాండ్" అనేది ఉంటుంది. "థైరాక్సిన్" అనే ఒక హార్మోన్ ని ఈ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరంలోని జీవక్రియ రేటును కంట్రోల్ చేస్తుంది. అదే "థైరాయిడ్ గ్లాండ్" పనితీరు సరిగ్గా లేకపోతే 'హార్మోన్స్ ఇంబ్యాలెన్స్' మూలంగా మన జీవక్రియ సరిగ్గా జరగక మన శరీరానికి కావలసిన శక్తి అనేది అందదు. దీనినే థైరాయిడ్ అంటారు. లేదా థైరాయిడిజం అంటారు.
థైరాయిడ్ కూడా రెండు రకాలు ఉంటాయి.
1.హైపర్ థైరాయిడిజం
2.హైపోథైరాయిడిజం
థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా హార్మోన్స్ ని విడుదల చేస్తే "హైపర్ థైరాయిడిజం" అని అంటారు. అయితే స్త్రీలలోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
థైరాయిడ్ గ్రంధి అనేది లెస్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తే "హైపోథైరాయిడిజం" గా పిలుస్తారు. ప్రస్తుతం "హైపోథైరాయిడిజం" తోనే చాలా మంది బాధపడుతున్నారు.
థైరాయిడ్ రావడం వలన వచ్చే సమస్యలు ఏమిటి :
ముఖ్యంగా ఈ థైరాయిడ్ మూలంగా త్వరగా అలసిపోవడం, ఒంట్లో శక్తి అంతా తగ్గినట్టు అనిపించడం, అలాగే చలి ఎక్కువగా అనిపించటం, ఆకలి తక్కువగా అనిపించడం, బరువు, ఊరికినే పెరిగిపోవటం, జుట్టు రాలిపోవడం, ఎక్కువగా చమట పట్టడం, ఇలాంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి.
చాలా మంది థైరాయిడ్ మందుల వలన మాత్రమే కంట్రోల్ లోకి వస్తుందని అనుకోవడం తప్పు. మందులను తీసుకుంటూ సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలను శాశ్వతంగా ఖచ్చితంగా నియంత్రించుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.
Thyroid Remedies :
1. రెమిడీ:-1
రెమిడీకి కావలసిన వస్తువులు :
దీనికోసం ముందుగా మనకు కావలసినవి మన వంటగదిలో ఉండే ధనియాలు.
తయారీ విధానం :
మీరు ముందుగా ఈ రెమిడీ ని తయారుచేసుకోవడానికి ఒక పాన్ లో ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని ఆ వాటర్ లో ఒకటి లేదా రెండు స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. మీ దగ్గర ధనియాలు లేకపోతే మీరు ధనియాల పొడి ని కానీ లేదా కొత్తిమీర ఆకులు వేసి అయినా సరే నీటిని కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఇప్పుడు 'నీరు' బాగా మరిగింది కదా! ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ నీటిని వడ పోసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్ లో మీరు రుచి కోసం ఒక అర స్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఈ వాటర్ ని మీరు పరగడుపున ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే 'హైపోథైరాయిడిజం' అనేది మీరు చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
2. రెమిడీ:-2
రెండవ రెమిడీ కి కావాల్సిన వస్తువులు :
ఇప్పుడు రెండవ రెమిడీ కోసం మనకు కావాల్సింది.! 'అవిస గింజలు'.
పాటియాసిడ్స్, ఒమేగా3 అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి "థైరాయిడ్" పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మన థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ ను కావాల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. కాబట్టి థైరాయిడ్ తో బాధపడేవారికి అవిస గింజలు ఒక మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
తయారీ విధానం :
మీరు ఏం చేయాలి అంటే ఈ అవిస గింజలు ను ఒక పాన్ లో వేసి ఒక రెండు నిమిషాలు పాటు డ్రై ఫ్రై అనేది చేసుకోవాలి. మరి ఫ్రై కాకుండా వీటిని లైట్ గా 'వేడి' చేస్తే సరిపోతుంది. ఇలా వేడి చేసి తయారుచేసుకున్న అవిస గింజలను మీరు మిక్సీలో వేసి వీలైనంత వరకు మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇలా తయారుచేసుకున్న ఈ పొడిని మీరు ఒక మంచి కంటైనర్ లో ఒక నెల రోజులపాటు నిల్వ కూడా చేసుకోవచ్చు.
ఇలా తాయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు ఎలా తీసుకోవాలి?
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తయారుచేసుకున్న ఈ అవిసగింజల పొడిని కలుపుకొని తాగొచ్చు. లేదా మీరు అవిస గింజలను ఒక స్పూన్ మోతాదులో తిని అయినా సరే వాటర్ ని తీసుకోవచ్చు. అయితే మీరు ఈ రెమిడీ ని ఉదయాన్నే పరగడుపున మాత్రమే ఫాలో అవ్వాలి. ఉదయాన్నే మీరు ఈ రెమిడీని ఫాలో అవ్వాలని అనుకుంటే మీరు రాత్రి నిద్ర పోవడానికి ముందు అయినా ఈ ధనియాల కషాయాన్ని తీసుకోవచ్చు. లేదా రెండిటిలో మీకు నచ్చిన ఏ రెమిడీ ని అయినా ఫాలో అవ్వండి. అలాగే మీరు అవిస గింజలు పొడిని మీరు ప్రతి రోజు మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. మీరు పొడిని 'పెరుగు'లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు గోధుమపిండిలో ఈ పొడిని ఒకటి లేదా రెండు స్పూన్స్ మోతాదులో కలిపి చపాతి రూపంలో అయినా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు 1 లేదా 2 స్పూన్స్ అవిస గింజలు పొడిని తీసుకుంటూ ఉంటె మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది.
Also Read:- Heart attack symptoms.! గుండెపోటు లక్షణాలు.! తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- అలాగే "థైరాయిడ్" తో బాధపడేవారు ఉప్పును చాలా వరకు తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే మనం రోజు తీసుకునే సాల్ట్ లో అయోడిన్ శాతం అధికంగా ఉంటుంది. అయితే ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటే థైరాక్సిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేసి హైపర్ థైరాయిడ్ కలిగేలా చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ ఉన్న వారు రోజుకి ఐదు గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి.
- అలాగే హైపోథైరాయిడ్ తో బాధపడేవారు మీ ఆహారంలో పచ్చి కూరగాయలు తక్కువగా తింటే మేలు. ఎందుకంటే పచ్చి కూరగాయల్లో ఉండే జియోట్రెజిన్ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా క్యాబేజి, క్యాలి ఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి ఇలాంటివి తక్కువ తింటే మంచిది.
- అలాగే పాలతో చేసిన పాలపదార్థాలను కూడా మీరు తక్కువగా తీసుకుంటే చాలా మంచిది.
- అయితే మీరు ఈ రెమిడీస్ తో పాటు మీరు మీ ఆహారంలో బి విటమిన్, ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి.
- అలాగే ఎ విటమిన్ అధికంగా ఉండే క్యారెట్, గుమ్మడికాయలు, కోడి గుడ్లు, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారాన్ని అలాగే టమాటో, చెర్రీస్, బీట్తీ రూట్ వంటివి తీసుకోవడం కూడా థైరాయిడ్ ఉన్నవారికి చాలా మంచిది.
- అలాగే చేపలు ఎందుకంటే చేపలలో కూడా ఒమేగా3, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన, అవసరమైన ముఖ్యమైన 'పోషకాలు' అందిస్తాయి. అలాగే ఇది మన శరీరం మెటబాలిజం ని క్రమబద్దీకరించి మన థైరాయిడ్ సమస్య నుంచి బయట పడేటట్లు చేస్తుంది.
- మరొక అతి ముఖ్యమైనటువంటి ఆహారం "ఆలీవ్ ఆయిల్". ఎందుకంటే ఆలీవ్ ఆయిల్ లో కూడా మన శరీరానికి కావలసిన అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేసి మన థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు పరుస్తుంది.
- ప్రతి రోజు మీరు ఒక కోడిగుడ్డు తింటే చాలు థైరాయిడ్ నుంచి మీరు చాలా సులభంగా త్వరగా బయటపడవచ్చు. ఎందుకంటే గుడ్డులో అయోడిన్ అలాగే ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు కూడా తినొచ్చు.
- ఇలా మీరు ప్రతి రోజు రెండు 'కోడిగుడ్లు' తినేయొచ్చు. కానీ ఇది మీ 'థైరాయిడ్ లెవెల్స్' పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకే రకంగా ప్రతి ఒక్కరి శరీరం ఉండదు. కాబట్టి మీ లెవెల్స్ బట్టి మీరు ప్రతి రోజు ఒకటి లేదా రెండు కోడిగుడ్లు తీసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే మీరు తినే కోడి గుడ్డు పచ్చ సొన తీసేసి తినండి. ఇలా మీ శరీరానికి మీరు కోడి గుడ్డును అందివ్వటం మాత్రమే కాకుండా మీ థైరాయిడ్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
- అలాగే థైరాయిడ్ తో బాధపడేవారు ఫాట్ తక్కువగా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మీ థైరాయిడ్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
- మీరు వేసుకునే మందులతో పాటు ఇప్పుడు చెప్పిన రెమిడీస్ ఆహారంలో మార్పులు చేసుకుంటూ మంచి వ్యాయమం ఫాలో అవుతూ ఉంటే మీరు కేవలం కొద్ది రోజుల్లోనే మీ థైరాయిడ్ ప్రాబ్లమ్ కి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.