Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Best health insurance in India in telugu హెల్త్ ఇన్సూరెన్స్

Best health insurance in India in telugu

Best-health-insurance-in-India-in-telugu

నమస్కారం హెల్త్ టిప్స్ తెలుగు కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం Health insurance policy ని తీసుకుందాం అనుకుంటాం. కానీ మనలో చాలా మందికి కరెక్ట్ అయిన health insurance policy ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పటివరకు తెలీదు. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? Health insurance agent సజెస్ట్ చేసాడు కదా అని చెప్పి health insurance policy ని తీసుకుంటూ ఉంటారు. తర్వాత అది సెట్ కాక బాధపడుతూ ఉంటారు. 

ఈ రోజు ఈ ఆర్టికల్ లో కరెక్ట్ అయిన health insurance policy ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రీమియం ఎంత ఉండాలి? యావరేజ్ ఎంత ఉండాలి? ఇవన్నీ ఈ ఆర్టికల్ లో తెలియజేయబోతున్న ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవండి. 

  • ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే కవరేజ్, ఏ పాలసీలో అయితే కవరేజ్ ఎక్కువ ఉందో ఆ పాలిసీనే సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ లో చాలా health insurance company లు వచ్చేశాయి. వీటన్నిటిని కంపేరింగ్ చేసుకోవాలి. ఎందులో అయితే ప్రీమియం తక్కువ ఉండి కవరేజ్ అన్నది ఎక్కువ ఉందో అదే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 

నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏమిటంటే క్లయిమ్బ్ సెటిల్మెంట్ రేషియో(climb settlement ratio) ఎప్పుడైనా సరే ఈ climb settlement ratio ఏ కంపెనీ కి అయితే ఎక్కువ ఉందో ఆ కంపెనీ నే సెలెక్ట్ చేసుకోండి. ఇది సాధారణంగా 90% కన్నా ఎక్కువే ఉంటుంది. కొన్ని కంపెనీస్ కి అయితే 98% ఉంది. అలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 

అసలు Climb Settlement Ratio అంటే ఏమిటి?

ఇంత పెర్సెంట్ అఫ్ క్లయింట్స్ ని సెటిల్ చేసింది ఆ కంపెనీ అని అర్థం. అంటే 100% కి 98% అఫ్ ది క్లయింట్స్ సెటిల్ అయిపోయినాయి. అందుకే ఇలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 

ఈ మధ్య కాలంలో చాలా మంది చేసిన తప్పు ఏంటో తెలుసా?

ఎక్కడైతే ప్రీమియం తక్కువ ఉందో ఆ కంపెనీస్ ని చేసుకుంటూ ఉన్నారు. అసలు ఆ కంపెనీ ఎలాంటిది. ఆ క్లైమ్బ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది. ఇదంతా పట్టించుకోవట్లేదు. కొన్ని కొన్ని కంపెనీస్ కి 20% ఉంటది. చాలా మంది ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంది కదా అని చెప్పి అలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ తప్పు మాత్రం అస్సలు చేయొద్దు. ఏ కంపెనీ కి అయితే 90% కన్నా ఎక్కువ ఉండి ఒకవేళ 98% వరకు ఉంటె అలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా చాలా ముఖ్యం. 

Family-float-health-insurance-plan
Family float health insurance plan

  • మనం Family float health insurance plan తీసుకుంటూ ఉంటాం. అంటే ఇది మన ఫామిలీ మొత్తాన్ని కవర్ చేసేదే family float health insurance plan. కొన్ని company వాళ్ళు ఏం చేస్తున్నారు? Family photo health insurance plan మనకి సేల్ చేస్తున్నారు. కానీ అందులో మన సెకండ్ చైల్డ్ నో, థర్డ్ చైల్డ్ నో మెన్షన్ చేయట్లేదు. అందువలన ఇప్పటి నుంచి గనక మీరు family float health insurance plan తీసుకునట్లయితే డాక్యూమెంట్స్ అన్నిప్రోపర్ గా చదవండి. మన ఫామిలీ లో అందరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే వాళ్ళని అడగండి. వాళ్ళను యాడ్ చేయము అన్నట్లయితే వేరే పాలసీ కి షిప్ట్ అవ్వండి. ఈ రకంగా వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండాలి. 
  • Pre existing deceases కి కాస్త వెయిటింగ్ పిరియడ్ అంటూ ఉంటుంది. అంటే ఫర్ ఎక్సమ్ ఫుల్ మీకు diabetes ఉంది, ఆ diabetes ని వెంటనే ఈ పాలసీలో మెన్షన్ చేయరు. కాస్త టైం తీసుకుంటారు. ఇది ఎప్పుడైనా సరే ఏ పాలసీ లో అయితే తక్కువ ఉందో ఆ పాలసీ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. కొన్ని కంపెనీస్ లో 4 సంవత్సరాలు ఉంది. అంటే 4 సంవత్సరాలు వరకు ఈ ప్రాబ్లమ్ ని ఇందులో మెన్షన్ చేయరు. అంటే 4 సంవత్సరాలు ముందుగానే మీకు diabetes వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే తనకి అమౌంట్ ఎవ్వరు. ఏ పాలసీలో లేదా ఏ కంపెనీ లో అయితే తక్కువ పిరియడ్ ఉందో ఆ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మినిమమ్ పిరియడ్ చూసుకున్నట్లైతే చాలా కంపెనీస్ లో 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. అలాంటి కంపెనీస్ నే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 
  • Network hospitals ఫర్ ఎక్సమ్ ఫుల్ మీరు Health insurance policy ని తీసుకున్నారు. అలా తీసుకున్నట్లు అయితే మీకు కొన్ని డాక్యూమెంట్స్ ఇస్తారు. ఆ డాక్యూమెంట్స్ లో కొన్ని హాస్పిటల్ పేర్లు  మెన్షన్ చేసి పెడతారు. ఆ హాస్పిటల్స్ మీ సరౌండింగ్స్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున మీరు 24 గంటల కన్నా ఎక్కువ సేపు హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లయితే మీకు health insurance claim అనేది లభిస్తూ ఉంటుంది. వాళ్ళ అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక పాలసీ లో మెన్షన్ చేసి ఉన్న హాస్పిటల్ లో డైరెక్ట్ గా అడ్మిట్ అయినట్లయితే వాళ్ళు వాళ్ళు అమౌంట్ చూసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కాష్ లెస్ క్లెయిమ్  జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా పే చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి హాస్పిటల్ లో జాయిన్ అవ్వకుండా, వేరే హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లయితే అమౌంట్ మొత్తం మీరే కట్టుకోవాలి. తర్వాత ఆ డాక్యూమెంట్స్ అంటే బిల్స్ తీసుకెళ్ళి health insurance వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అప్పుడు కాష్ ఇస్తూ ఉంటారు. 
  • ఒకవేళ మీరు కనుక విలేజెస్ లో ఉన్నట్లయితే మీరు చెక్  చేసుకోండి, మీకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పేరు. ఇందులో మెన్షన్ చేసి ఉందా లేదా? ఇవన్ని చెక్ చేసుకున్న తరువాతే పాలసీ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే కాష్ లెస్ బెనిఫిట్ మీకు లభిస్తూ ఉంటుంది. 
  • Sub limits: ఇవి ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అసలు sub limits అంటే ఏంటంటే రూమ్ రెంట్ కి ఇంత, అంబులెన్స్ కి ఇంత అని చెప్పి పాలసీలో ముందుగానే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఆ లిమిట్స్ అన్నవి ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. పర్ ఎక్సమ్ ఫుల్ మీకు షబ్ లిమిట్ అన్నది 5000/- అని మెన్షన్ చేశారు రూమ్ రెంట్ కి, అలాంటప్పుడు మీరు పెద్ద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనుకోండి ఒక్కరోజుకే 5000/- ఛార్జ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ అమౌంట్ అనేది మీకు ఎక్కడ సరిపోతుంది. నెక్స్ట్ డేస్ అంతా మీ పాకెట్ లో నుంచి మనీ పే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ sub limits అనేది ఎప్పుడైనా సరే కవరేజ్ ఎక్కువ ఉండేటట్టే ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 
  • Premiums: ఇవి కంపేర్ చేసుకోవాలి. చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కవరేజ్ ఏమో తక్కువ ఇస్తున్నాయి. ప్రీమియం ఏమో ఎక్కువ పెడుతున్నాయి. చాలా మందికి అవగాహన లేక ఆ కంపెనీస్ లో పాలసీ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో కూడా చాలా వెబ్సైట్స్ లో కంపేర్ చేస్తున్నారు. ఈ పాలసీకి ఇంత కవరేజ్ ఉంది. ప్రీమియం ఇంత ఈ పాలసీకి ఇంత ఉంది. దీని ప్రీమియం ఇంత అని చెప్పిసి కంపేర్ చేస్తున్నారు. అలా పాలసీ తీసుకునే ముందుగానే ఆన్లైన్ లోకి వెళ్లి చెక్ చేసి దేనికైతే ఎక్కువ కవరేజ్ ఉండి తక్కువ ప్రీమియం ఉందో అలాంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోండి. 
  • Exclusions: తెలుగులో షరతులు అని చెప్పుకోవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు. మా పాలసీ చాలా గ్రేట్. ఇంత కవరేజ్ ఇస్తున్నాం. ప్రీమియం కూడా చాలా తక్కువ ఉందని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కానీ ప్రతి దానికి షరతులు ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకోండి. ప్రతి కంపెనీ పాలసీ చూడండి ఏ దాంట్లో అయితే షరతులు తక్కువ ఉన్నాయో అవే సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మీకు సెట్ అయిన మీకు కరెక్ట్ అనిపించిన పాలసీ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 

అసలు ఈ కవరేజ్ అన్నది మేము ఎంత తీసుకోవాలి?

Health-Insurance-policy
Health Insurance policy

  • దానికి కూడా ఒక థంబ్ రూల్ ఉంది. దీని ప్రకారం 50% మీ సంవత్సర ఆదాయం మరియు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మీరు ఎంత అయితే మీరు మెడికల్ పర్పస్ మీద ఖర్చు పెట్టారో అంతా. అంటే ఇవి రెండు కలిపితే ఎంత అయితే అమౌంట్ వస్తుందో అంత కవరేజ్ అన్నది మీరు తీసుకోవాలనమాట. పర్ ఎక్సమ్ ఫుల్ మీ సంవత్సర ఆదాయం అనేది 10 లక్షలు అనుకుందాం. అంటే 10 లక్షలు లో 50% అంటే 5 లక్షలు. అంతే కాకుండా మీరు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఒక 3 లక్షలు వరకు మెడికల్ పర్పస్ మీద ఖర్చు పెట్టారు. అంటే 3 లక్షలు అనుకుందాం. 5+3=8 అంటే 8 లక్షలు మొత్తం మీ కవరేజ్ అయి ఉండాలి.

ప్రీమియం ఎంతుండాలి.?

  • ప్రీమియం ఎంత ఉండాలంటే ఒక సంవత్సర ఆదాయంలో 2% ఉండాలి. మీ సంవత్సర ఆదాయం వచ్చేసి 10 లక్షలు. 10 లక్షలలో 2% అంటే 20 వేలు. ఇంత మాత్రమే మీ ప్రీమియం అన్నది ఉండాలి. ఈ రకంగా కాల్కులేట్ చేసుకోవాలి. ఈ రకంగా health insurance తీసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT