Functions, problems, and precautions of the digestive system
ఈ ఆర్టికల్ లో మనం తినే ఆహారం ఎలా జీర్ణం అవుతుందో మన జీర్ణ వ్యవస్థలో ఉండే వివిధ రకాల భాగాలు, అలాగే వాటి పని తీరు, ఇంకా మన జీర్ణ వ్యవస్థ కి వచ్చే సమస్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా తెలుసుకుందాం. పళ్ళు, గింజలు, కాయలు, ఆకులు, తేనె, చిన్న చిన్న జంతువులు ఇవే ఒకప్పుడు మనిషి ఆహారం.
ఇవి జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థ పెద్ద పని ఏం కాదు. కాఫీ, కూల్ డ్రింక్స్, చాకోలెట్ లు, కట్లెట్ లు, కేక్ లు, బిస్కెట్ లు, పిజ్జా, బర్గర్ లు, పూరీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రై లు, మంచురియా లు ఇంకా బీర్లు బిర్యానీలు. ఇది నేటి ఆధునిక మనిషి యొక్క ఆహారం.
సహజమైన పదార్థాలకు అధిక మొత్తంలో ఉప్పు, కారం నూనెలు పట్టించి కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు అద్ది ఆ పదార్థాల లోని పోషకాలన్నీ ఆవిరి అయిపోయే వరకు కాల్చి, వేయించి, మాడ్చి మనం తింటున్నాం. మరి ఇలాంటి ఆహారాన్ని జీర్ణం చేసి అందులో అరకొరగా ఉండే పోషకాలను బయటికి తీసి మనకు అందివ్వటం, మిగిలిన వ్యర్ధాలను విషపదార్థాలను బయటికి పంపడం అంటే మన జీర్ణ వ్యవస్థకు పెద్ద సవాలే. మరి మన జీర్ణ వ్యవస్థ ఆ సవాల్ని ఎలా సమర్థవంతంగా పూర్తి చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ని చివరిదాకా చదవండి.
జీర్ణవ్యవస్థ యొక్క ముఖ్యమైన పని
Digestive System |
జీర్ణవ్యవస్థ ముఖ్యమైన పని ఆహారాన్ని జీర్ణం చేయడం. మనం తినే ఆహారంలో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. తక్కువ మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పోషకాలు నేరుగా రక్తంలోకి అబ్జార్వ్ కావు. మన జీర్ణ వ్యవస్థ మనం తిన్న ఆహారంలోని పోషకాలను సరళ రూపంలోకి మార్చి రక్తంలోకి పంపాల్సి ఉంటుంది. జీర్ణక్రియలో ప్రోటీన్స్ అమైనోయాసిడ్స్ గాను, ఫాట్ ఫ్యాటీ యాసిడ్స్ గాను, ఇక పిండి పదార్ధాలు గ్లూకోజ్ గాను మార్చబడతాయి. జీర్ణంకాని వ్యర్ధాలను బయటికి పంపడం, విషపదార్థాలను నిర్విర్యం చేయటం, ఆహారంతో పాటు కడుపులోకి ప్రవేశించిన క్రీములను చంపడం ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ చేసే పనులే. మన జీర్ణవ్యవస్థ నోటితో మొదలై పాయువు వరకు వివిధ భాగాలు ఒకదానికొకటి అతుక్కుని ఒక గొట్టం లాగా ఉంటాయి. గొట్టాన్ని ఎలిమెంటరీకెనాల్ అంటారు. దీనిని మొత్తం పొడవు 30 అడుగులు. నోట్లో దంతాలు, నాలుక, ఆహారాన్ని నమ్మడానికి ఉపయోగపడతాయి. అయితే ఆహారాన్ని మెత్తగా చేయడం కోసం నోట్లో లాలాజలం స్రవించబడుతుంది. ఒక మనిషి నోట్లో రోజుకు సుమారు 1 నుండి 1.5 లీటర్ల లాలాజలం స్రవించబడుతుంది. లాలాజలంలో సలైవరిఅమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తుంది. అంటే జీర్ణక్రియ అనేది మన నోటిలోనే ప్రారంభం అయిపోతుంది.
అన్నాన్ని బాగా నమిలి తినడం వలన మన నోటి లోనే 30% వరకు జీర్ణక్రియ పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ లోని మిగిలిన అవయవాల పై పని భారం తగ్గుతుంది. అయితే మనం తినేటప్పుడు ఆహారాన్ని చూస్తూ, ఆ వాసనని ఆస్వాదిస్తూ తింటే సరైన మొత్తంలో లాలాజలం ఉత్పత్తి అయ్యి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఏ TV చూస్తూనో, మొబైల్ మాట్లాడుతూనో తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఎందుకంటే జీర్ణక్రియకి కావాల్సిన రసాలు, ఎంజైమ్ లు, హార్మోన్ల ఉత్పత్తిని మెదడు నియంత్రిస్తుంది. అందుకే తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి. మన లాలాజలంలో లైసోజైమ్ అనే యాంటీ బాక్టీరియల్ పదార్థం కూడా ఉంటుంది. ఇది నాచ్చురల్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. అందుకే మన శరీరంలో మిగిలిన భాగాల్లో వచ్చిన పండ్ల కంటే నోట్లో వచ్చిన పుండ్లు త్వరగా మానిపోతాయి.
కొన్ని రకాల జంతువుల లాలాజలంలో NGF అనే మరొక పదార్ధం ఉంటుంది. ఇది లైసోజెన్ కంటే కూడా చాలా శక్తివంతమైనది. అందుకే జంతువులు, వాటి గాయాలను నాలుకతో నాకుతూ లాలాజలం ద్వారా వాటిని శుభ్రం చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల వాటి యొక్క గాయాలు త్వరగా మానిపోతాయి.
మన గొంతు భాగంలో వాయునాళం ఆహార నాళము రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆహారాన్ని మింగే టప్పుడు పొరపాటుగా ఆహారం వాయునాళం లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి వాయునాళం పైన ఎపిగ్లోటిస్ అనే తలుపు వంటి భాగం ఉంటుంది. మనం ఆహారాన్ని మింగేటప్పుడు ఈ ఎపిగ్లోటిస్ వాయునాళాన్ని మూసి ఉంచుతుంది. ఒకవేళ పొరపాటుగా ఆహారం వాయునాళం లోకి వెళ్తే దగ్గు రూపంలో ఆహారం బయటకు వచ్చేస్తుంది. దీన్నే పొలమారడం అంటారు. దంతాలు, నాలుక, లాలాజలం సహాయంతో మెత్తగా నామలబడిన ఆహారాన్ని బోలస్ అంటారు. ఇది ఇసొపేగాస్ అనే గొట్టం ద్వారా కడుపులోకి చేస్తుంది. ఇది సుమారు 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని కండరాలు, ప్రత్యేక కదలికల ద్వారా ఆహారాన్ని జీర్ణాశయం లోకి నెడతాయి.
ఈ కదలికల్ని పెరిస్టాలిసిస్ అంటారు. మనం ఏ భంగిమలో ఉన్న పెరిస్టాలిసిస్ వలన ఆహారం ఎప్పుడు కడుపులోకి ప్రయాణిస్తుంది. ఈ ఇసొపుగాస్ చివర ఉండే స్పెంగ్తార్ ఆహారాన్ని వెనక్కి రాకుండా ఆపుతుంది. కేవలం ఆహారం అరగనప్పుడు రివర్స్ పెరిస్టాలిసిస్ ద్వారా ఆహారం కడుపులో నుండి నోట్లోకి వస్తుంది. దీన్నే వామిటింగ్ అంటారు. ఇసొపేగాస్ ద్వారా ఆహారం జీర్ణాశయం అంటే స్టమక్ లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా మన జీర్ణాశయంలో 1 లీటర్ ఆహారం పట్టే ఖాళీ మాత్రమే ఉంటుంది. అయితే జీర్ణాశయానికి బాగా సాగే గుణం ఉండటం వలన ఇది ఇంచుమించు 4 లీటర్ల వరకు ఆహారాన్ని హోల్డ్ చేయగలుగుతుంది.
జీర్ణాశయం సైజు మనిషి మనిషి కి మారుతుంది. జీర్ణాశయంలో గాఢమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన ఆహారంలోని క్రిములను నాశనం చేస్తుంది. అలాగే ఆహారాన్ని అసిటిక్ గా మార్చేస్తుంది. మన ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ జీర్ణం అవ్వాలంటే ఈ ఆహారం అసిటిక్ గా మారాలి.
మరి ఇంత గాఢమైన యాసిడ్ కడుపులో ఉంటే మన కడుపుకి ఏమి కాదా?
జీర్ణాశయంలో ఉండే మ్యూకస్ పొర ఆ యాసిడ్ వలన కడుపు గోడలు కాలి పోకుండా కాపాడుతుంది. జీర్ణాశయంలో యాసిడ్ తో పాటు కొన్ని ఎంజైమ్స్ కూడా సెక్యూరిటీ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయంలో ఆహారం మజ్జిగ చిలికి నట్లుగా చిలక పడుతుంది. దీన్నే కైమ్ అంటారు. జీర్ణాశయం చివర పైలోరిక్ స్పిన్గ్టెర్ అనే ఒక వాల్ ఉంటుంది. ఇది ఆహారాన్ని కొద్ది కొద్దిగా చిన్న ప్రేగులోకి విడుదల చేస్తుంది. చిన్న పేగలోని మొదటి భాగాన్ని డుయోడినం అంటారు. ఇది 25 నుండి 28 సెంటీమీటర్ల పొడవుంటుంది. దీనికి లివర్ అలాగే పాంక్రియాస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. పాంక్రియాస్ జీర్ణ రసాలను, లివర్ పైత్య రసాలను డియోడినం లోకి విడుదల చేస్తాయి.
మనం తిన్న ఆహారంలో కొవ్వులు జీర్ణం అవ్వాలంటే లివర్ నుంచి వచ్చే బయల్ చాలా అవసరం. ఈ బయల్ గాల్బ్లాడర్ అనే ఆకుపచ్చ బుడగలాంటి భాగంలో నిలవ ఉండి, కొద్ది కొద్దిగా డియోడినం లోకి విడుదలవుతుంది. చిన్నప్రేగు గోడలు కూడా జీర్ణ రసాల విడుదల చేస్తాయి. ఇవన్నీ కలిపి ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేలా చూస్తాయి. చిన్న ప్రేగు సుమారు 20 అడుగులు పొడవు ఉంటుంది. దీని లోపల గోడలపై వెళ్లాయి అనే చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి జీర్ణమైన ఆహారంలోని పోషకాలని అబ్జార్వ్ చేసుకొని బ్లడ్ లోకి పంపుతాయి. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులో ప్రవేశిస్తుంది. పెద్దపేగు పొడవు 5 అడుగులు. కానీ చిన్న పేగు తో పోల్చితే ఇది రెండింతల మదంతో ఉంటుంది. అందుకే దీన్ని పెద్ద ప్రేగు అంటారు. జీర్ణంకాని ఆహారంలోని నీరు, విటమిన్లు, పెద్ద పేగులో రక్తంలోకి అబ్జార్వ్ అవుతాయి. పెద్ద పేగులో జీర్ణం కాని ఆహారం నుండి బాక్టీరియా విటమిన్లను తయారుచేస్తాయి. ముఖ్యంగా Vitamin K అలాగే బయోటిన్ విటమిన్స్ పెద్ద ప్రేగులో తయారవుతాయి. మిగిలిన వ్యర్ధం బలంగా మారుతుంది. దీన్ని స్టూల్ అని అంటారు. ఇది రక్తం అనే భాగాన్ని చేరుకుంటుంది. ఇక్కడి నుంచి పాయువు ద్వారా బయటికి విసర్జించబడుతుంది.
జీర్ణ వ్యవస్థకు చెందిన కొన్ని ఆరోగ్య సమస్యలు వాటికి గల కారణాలు:
1. ఎసిడిటీ:
కడుపులో యాసిడ్ ఎక్కువ అయితే మంట పడుతుంది. ఒక్కోసారి ఈ కడుపులో ఉన్న యాసిడ్ గొంతులోకి తన్నుకొస్తుంది. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. తెలుగులో పుల్ల త్రేనుపులు అంటారు.
ఎసిడిటీకి ముఖ్య కారణాలు:
ఎక్కువగా స్పైసి గా ఉన్న ఫుడ్ తినడం, రాత్రులు లేట్ గా తినటం, కడుపు కిక్కిరిసి నట్టుగా తినడం. ఇంకా ఆల్కహాల్ తీసుకోవడం, టీ, కాఫీ లు అధికంగా త్రాగడం, మొదలైనవన్నీ కూడా ఎసిడిటీకి కారణాలు.
మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం ద్వారా దీన్ని వివారించుకోవచ్చు.
2. ఫుడ్ పాయిజనింగ్:
బాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్ వల్ల కలుషితమైన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు జీర్ణాశయంలో యాసిడ్ అనేది క్రీములను పూర్తిగా నాశనం చేయలేదు. అలాంటప్పుడు ఈ బాక్టీరియా ప్రేగుల్లో ప్రవేశించి ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది. ఇది నివారించు కోవటానికి, శుచిగా, శుభ్రంగా ఉండిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
3. అల్సర్స్:
జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడితే అల్సర్ అంటారు. ఇవి ముఖ్యంగా హెచ్ పైలోరి అనే బాక్టీరియా వల్ల కలుగుతాయి. ఫ్రూట్స్, వెజిటల్స్ అధికంగా తినడం వలన దీనిని నివారించవచ్చు.
4. మలబద్దకం:
రోజు విరోచనం ఫ్రీగా కాకపోతే మలబద్ధకం అంటారు. అధికంగా జంక్ ఫుడ్ తినడం, సరైన మొత్తంలో నీళ్ళు తాగక పోవడం, ఆహారంలో పీచు పదార్థాలు తినకపోవడం మొదలైనవి ఈ మలబద్దకాన్ని కారణాలు. దీన్ని నివారించుకొనే పోతే ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు కొన్ని "హెల్త్య్ ఈటింగ్ హ్యాబిట్స్" ని చూద్దాం.
1. ప్రశాంతంగా తినడం:
తినడానికి ముందు కనీసం 2 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవాలి. అందుకే చాలా మంది తినే ముందు ప్రార్ధన చేయటం లేదా ప్రాణాయామం చేయడం మొదలైనవి చేస్తారు. దీని వల్ల మన బాడీ రిలాక్స్ అయ్యి ఒక సమతా స్థితిలోకి వస్తుంది. అటువంటి స్థితిలో ఎంజైమ్స్, హార్మోన్స్ సక్రమంగా విడుదలవుతాయి.
2. బాగా నమిలి తినాలి:
ముద్ద 32 సార్లు నమిలి తినాలి అనే నానుడి మనకి బాగా తెలుసు. మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేటితరం ఆధునిక శాస్త్రవేత్తలు కూడా విషయాన్ని నిర్ధారించారు. మనం తినే ఆహారాన్ని 32 సార్లు నవిలి తినడం వల్ల అది పూర్తిగా నలగడంతో పాటు జీర్ణక్రియ అనేది సాఫీగా, సక్రమంగా జరుగుతుందని గుర్తించారు. మనం వీలైనంతవరకు ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి.
3. తినగానే నిద్ర పోకూడదు:
తినగానే పడుకుంటే ముఖ్యంగా మూడు సమస్యలు వస్తాయి. ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ తినగానే పడుకుంటే కడుపులోని యాసిడ్ గొంతులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరగడం: తినగానే పడుకుంటే ఆహారం జీర్ణం అయినప్పుడు విడుదల శక్తి అంతా కూడా కొవ్వు కింద మారిపోతుంది. దీంతో ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. హార్ట్ స్ట్రోక్: లేట్ నైట్ తినడం, తినగానే పడుకోవడం వలన హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
4. నీళ్ళు త్రాగడం:
అన్నం తినడానికి 30 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట ఆగి నీళ్ళు త్రాగాలి. ఈ విధంగా నీళ్ళు త్రాగితే జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. తినేటప్పుడు గొంతు దిగక పోతే కొద్ది కొద్దిగా నీళ్ళు తీసుకోవచ్చు. కానీ మరి ఎక్కువ మొత్తంలో నీళ్ళు త్రాగితె జీర్ణ రసాలు పల్చబడి జీర్ణక్రియ దెబ్బతింటుంది.
5. పీచు పదార్దాలు:
మనం తినే ఆహారంలో ఖచ్చితంగా పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. అలాగే వండిన ఆహారపదార్ధాలుతో పాటు వండని ఆహార పదార్థాలు అంటే పళ్ళు, కాయగూర ముక్కలు, మొలకెత్తిన విత్తనాలు మొదలైనవి కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మన జీర్ణ వ్యవస్థ ని అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.